అన్వేషించండి

Sai Dharam Tej : ఫ్యాన్స్​తో సాయిధరమ్‌ తేజ్‌ చిట్ చాట్, నెటిజన్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక!

Sai Dharam Tej : హీరో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన 9 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. ఇందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు.

Hero Sai Dharam Tej Chit Chat With Fans : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2014 నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. ఆ  తర్వాత వరుస సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏండ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తన అభిమానులతో ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ నిర్వహించారు.  #AskSDT పేరుతో అభిమానులతో మాట్లాడారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

ఫుల్ ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చిన సాయి ధరమ్

చిట్ చాట్ లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఫుల్ ఫన్నీగా ఆన్సర్స్ చెప్పారు. మీ పెళ్లి ఎప్పుడు బ్రో? అని ఓ నెటిజన్ అడగ్గా, నీ వివాహం అయిన వెంటనే అని సమాధానం చెప్పారు. చిన్న మామ పవన్ కల్యాణ్ తో కలిసి సినిమా చేశారు? పెద్దమామ(చిరంజీవి)తో సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడిగితే, ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.  రామ్ చరణ్ తో కలిసి నటిస్తారా? అనే ప్రశ్నకు మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానని చెప్పారు.  ప్రస్తుతం ఏఏ సినిమాలు చేస్తున్నారనే ప్రశ్నకు, ఇప్పుడు కేవలం ‘గాంజా శంకర్’ మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించారు. మరోసారి మాస్ మూవీలో నటించడం పట్ల మీ రియాక్షన్ ఏంటనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు. తనకు మాస్ జానర్ అంటే చాలా ఇష్టం అన్నారు. అందుకే మరోసారి అదే జానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు.  

ఫ్యాన్ ప్రశ్నకు బ్రహ్మీ లాఫింగ్ జిఫ్ ఇమేజ్​తో ఆన్సర్

చిట్ చాట్​లో భాగంగా ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశాడు. అర్జెంట్ గా రూ. 10 లక్షలు కావాలని అడిగాడు. అయితే, ఈ ప్రశ్నకు బ్రహ్మానందం నవ్వుతూ ఉండే జిఫ్ ఇమేజ్ పెట్టి వదిలేశారు. ఇక తనకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్రలు ‘చిత్ర లహరి’, ‘రిపబ్లిక్‌’ మూవీస్ లోని క్యారెక్టర్లు అని చెప్పారు. రొటీన్ సినిమాలకు కాకుండా ‘విరూపాక్ష’ లాంటి సినిమాలు ప్రయత్నించాలని మరో నెటిజన్ సలహా ఇచ్చాడు. దీనికి సాయి ధరమ్, అన్ని  రకాల సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అభిమానుల ప్రేమ, సపోర్టు ఉండాలని కోరారు.  ఇక ‘విరూపాక్ష 2’ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు శాసనాల గ్రంథంలో చూసి చెప్పాలంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ఇక ఆయన నటించిన గత రెండు సినిమాలు మంచి విజయం అందుకోవడంతో, అదే జోష్​లో ప్రస్తుతం ‘గాంజా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.    

Read Also: మృణాల్‌తో నాని, అలా సరస్సులో సరదాలు - మరీ ఇంత రొమాంటిక్కా?

టాప్ హెడ్ లైన్స్

Kaaka Movie : మెగాస్టార్ కుమార్తెగా నందమూరి తేజస్విని - బాబీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా?
మెగాస్టార్ కుమార్తెగా నందమూరి తేజస్విని - బాబీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా?
Gundeninda Gudigantalu Oct 12: మీనాపై దాడి చేసిన చింతామణిని తిట్టి పంపించేసిన ప్రభావతి..స్నేహితురాలిలో మార్పుచూసి కామాక్షి షాక్‌
గుండెనిండా గుడిగంటలు: మీనాపై దాడి చేసిన చింతామణిని తిట్టి పంపించేసిన ప్రభావతి..స్నేహితురాలిలో మార్పుచూసి కామాక్షి షాక్‌
Meghasandesam Serial Today October 12th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు వెళ్లిన ఆకాష్‌ - కోపంతో రగిలిపోయిన సూర్య  
‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు వెళ్లిన ఆకాష్‌ - కోపంతో రగిలిపోయిన సూర్య  
Crazy Kalyanam Trailer : పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్
పెళ్లిళ్లు చేసుకున్నా లేకున్నా పిల్లల్ని మాత్రం కనండి - లివింగ్ టు గెదర్ అఫీషియల్... సీనియర్ నటుడు నరేష్ రియాక్షన్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget