అన్వేషించండి

Mathu Vadalara 2 Trailer: అదిరిపోయే పంచులు, ఆకట్టుకునే కామెడీ - ‘మత్తు వదలరా 2’ ట్రైలర్ చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే

Mathu Vadalara 2 Review: శ్రీ సింహా హీరోగా రితేష్ రానా తెరకెక్కిస్తున్న సినిమా ‘మత్తు వదలరా 2’. సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన మూవీ ట్రైలర్ ఫుల్ ఫన్నీగా అలరిస్తోంది.

Mathu Vadalara 2 Trailer Launched: తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సీక్వెల్ ‘మత్తు వదలరా 2’. ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసింది. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించగా, తాజాగా ట్రైలర్ విడుదలైంది.

ఫుల్ ఫన్నీగా ‘మత్తు వదలరా 2’ ట్రైలర్  

‘మత్తు వదలరా 2’ మూవీ విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను లాంచ్ చేసింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫన్నీగా అలరిస్తోంది. ‘హి’ టీమ్ ఏజెంట్లుగా ఉన్న శ్రీ సింహ, సత్య అనుకోని ఇన్సిడెంట్లలో ఎలా చిక్కుకుపోయారు? అనేది ఈ ట్రైలర్ ఆసక్తికరంగా చూపించారు. పోలీస్ ఆఫీసర్ సునీల్... శ్రీ సింహ, సత్యను దొంగలుగా, హంతకులుగా ఎందుకు భావిస్తారు? వారికి మరో ఏజెంట్ అయిన ఫరియా ఎలా సాయం చేస్తుందనేది ఫన్నీగా ప్రెజెంట్ చేశారు. ట్రైలర్ అంతా ఫన్, యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.

ఆకట్టుకున్న టీజర్..

రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. హీరో శ్రీసింహా, కమెడియన్ సత్య ఫన్, డైలాగులు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. వెల్‌కమ్‌ టు హీ  టీమ్‌ అంటూ సాగే ఈ టీజర్‌ నవ్వుల పువ్వులు పూయించింది. హి..హి..హి.. టీమా అంటూ పోలీస్ ఆఫీసర్ కామెడీ చేయడగా, అన్నీ హిలు లేవు.. ఒకటే హి అంటూ నవ్వించారు. దొంగతనాలు చేయడానికి సిగ్గు లేదా అంటే.. దొంగతనం కాదు.. తస్కరించుట అని సత్య చెప్పడం అలరిస్తుంది. ఈ సినిమాలో సత్య, శ్రీ సింహా చేసే కామెడీ మూవీకే హైలెట్ గా ఉండబోతోంది. ఫుల్ లెన్త్ కామెడీతో ఆకట్టుకుంది. 

‘మత్తు వదలారా’ చిత్రానికి పూర్తి భిన్నంగా..  

‘మత్తు వదలారా’ సినిమాతో పోల్చితే ఈ మూవీ పూర్తి డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఫరియా స్పెషల్ ఏజెంట్ గా కనిపించనుంది. పూర్తి స్థాయి యాక్షన్ తో ఆకట్టుకోనుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికి నచ్చుతుందని మేకర్స్ వెల్లడించారు. సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ సహా పలువురు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Read Also: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, జూనియర్ అభిమానులకు పూనకాలే, లాంచింగ్ ఎక్కడో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mega 158 Movie : మెగాస్టార్, బాబీ మూవీ - పూజా కార్యక్రమం To షూటింగ్ షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్
మెగాస్టార్, బాబీ మూవీ - పూజా కార్యక్రమం To షూటింగ్ షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్
Prakash Raj : చర్చిలో తల్లి అంత్యక్రియలు - విమర్శలపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
చర్చిలో తల్లి అంత్యక్రియలు - విమర్శలపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
Balakrishna : నాంది డైరెక్టర్‌తో బాలయ్య - మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా...
నాంది డైరెక్టర్‌తో బాలయ్య - మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా...
Rakasa Movie : ఓయ్ హీరోయిన్‌తో కంపేరిజన్ - రాకాస డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే?
ఓయ్ హీరోయిన్‌తో కంపేరిజన్ - రాకాస డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే?

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Embed widget