Manchu Manoj: త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నా - పెళ్లి గురించి హింట్ ఇచ్చిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవల కడప దర్గాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంచు మనోజ్ శుక్రవారం కడప దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తన వ్యక్తిగత, సినిమా జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మనోజ్. ‘‘చాలా కాలం నుంచి కడప దర్గాను దర్శించుకోవాలని అనుకుంటున్నా. మా కుటుంబ సభ్యులు, సన్నిహితులు కడప దర్గాను దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పారు. ఇక్కడకు రావడానికి ఎందుకో సమయం పట్టింది. ఆ అల్లానే తనను ఇక్కడకు రప్పించారు. ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. తర్వలోనే కొత్త సినిమా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నా. కొత్త జీవితంలోకి కూడా అడుగుపెడుతున్నా. మళ్లీ కుటుంబంతో కలసి దర్గాకు వస్తా’’ అని చెప్పుకొచ్చారు.
దర్గాలో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చలు మొదలైయ్యాయి. మంచు మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. అయితే మనోజ్ ఓ దివంగత రాజకీయ నేత రెండో కుమార్తెను వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు గత సెప్టెంబర్ లో సికింద్రాబాద్ గణేష్ మండపానికి ఈ ఇద్దరూ కలసి వెళ్లారు. అప్పుడే వీరి పెళ్లిపై వార్తలు వచ్చాయి. రాజకీయ ప్రవేశం, ఆమెతో పెళ్ళిపై తానే సమయం వచ్చినపుడు చెబుతానని మనోజ్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ చేసిన వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. మనోజ్ పెళ్లిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Adios amigo 🙌🏽 pic.twitter.com/vSSnbL0Sxd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 8, 2022
Let’s Hunt 💫🚀 pic.twitter.com/JlzUw9x1Px
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 11, 2022
ఇక ఇదే సందర్భంగా తన కొత్త ప్రాజెక్టులు గురించి కూడా చెప్పారు మనోజ్. ఫిబ్రవరి నుంచి కొత్త సినిమాలు ప్రారంభం అవుతాయిని చెప్పారు. కరోనా లాక్ డౌన్ కు ముందు ‘అహం బ్రహ్మాస్మి’ అనే ఓ కొత్త ప్రాజెక్టు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అది ముందుకు సాగలేదు. దీంతో మనోజ్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోతున్నాడా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇటీవల ఓ నెటిజన్ మనోజ్ సినిమాలపై అప్డేడ్ అడగ్గా.. ఓ స్మైల్ తో సరిపెట్టారు. అయితే ఈ మధ్యనే మనోజ్ సోషల్ మీడియాలో ఓ కొత్త లుక్ ను రిలీజ్ చేశారు. ఈ కొత్త లుక్ లో మనోజ్ చాలా స్లిమ్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అందులో మనోజ్ బాగా బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. దీంతో ‘అహం బ్రహ్మాస్మి’ మూవీ కోసమే ఈ స్టిల్ అని కొంతమంది అంటుంటే.. ఇంకొంతమంది మాత్రం మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ నుంచి తప్పుకున్నారని, ఇది కొత్త సినిమాలో లుక్ అని అంటున్నారు. ఇటీవల ఇంకో కొత్త స్టిల్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు మనోజ్. అందులో ఆయన ‘లెట్స్ హంట్’ అంటూ గన్ పట్టుకుని ఉన్నట్టు ఫోటో ఉంది. ఈ స్టిల్ చూసిన నెటిజన్స్.. ‘‘సినిమా అప్డేట్ ఇవ్వు అన్నా అంటే.. ఈ స్టిల్స్ తో సరిపెడతావు ఏంటన్నా? త్వరగా అప్డేట్ ఇవ్వు అన్నా’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొత్త ప్రాజెక్టుల విషయంలో మనోజ్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాాలి.