అన్వేషించండి

Malupu Teaser: ‘బిగ్ బాస్’ షణ్ముఖ్ కౌగిలిలో దీప్తి సునయనా.. గుండె బరువెక్కిస్తున్న ‘మలుపు’ టీజర్‌

షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన కలిసి నటించిన ‘మలుపు’ వీడియో సాంగ్ టీజర్ విడుదలైంది. గంటల వ్యవధిలోనే ఇది మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది.

దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ రియల్ కపుల్స్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. వీరిద్దరు కలిసి నటించినా.. డ్యాన్స్ చేసినా.. చూడాలని ఆశపడతారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది.. షన్ను (షణ్ముఖ్), బనానా(దీప్తి) కలిసి పనిచేయాలని కోరుతుంటారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వినయ్ షణ్ముఖ్.. వారిద్దరి ‘మలుపు’ వీడియో సాంగ్‌ను రూపొందించాడు. వినాయక చవితి సందర్భంగా యూట్యూబ్‌లో ‘మలుపు’ సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో ఒక మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 

షన్ను ప్రస్తుతం బిగ్‌ బాస్ సీజన్ 5 హౌస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పాట ద్వారా షన్నుకు మరింత మంది సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో షణ్ముఖ్ కూడా ఒకరు. బిగ్ బాస్‌లో చివరికి వరకు ఉండాలంటే.. తప్పకుండా ప్రేక్షకుల మద్దతు ఉండాలి. దీంతో బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా, ఆమె టీమ్.. ప్లాన్ ప్రకారం సరైన సమయంలో ఈ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు.

ఇక సాంగ్ టీజర్‌ను చూస్తే తప్పకుండా గుండె బరువెక్కుతుంది. భావోద్వేగ సన్నివేశాల్లో దీప్తి సునైనా జీవించిందనే చెప్పాలి. ఇందులోని లవ్.. రొమాన్స్‌తోపాటు ఎమోషనల్ సీన్స్ తప్పకుండా ఆకట్టుకుంటాయి. టీజర్ నచ్చేయడంతో అంతా ఇప్పుడు ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 16న యూట్యూబ్‌లో ఈ వీడియోను విడుదల చేయనున్నట్లు టీజర్ ద్వారా తెలిపారు. 

‘మలుపు’ సాంగ్ టీజర్:

దీప్తి, షన్నూ ఎప్పుడూ తాము ప్రేమికులమని చెప్పుకోలేదు. అలాగని ఆ వార్తను ఖండించలేదు కూడా. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటూ.. చక్కని జోడీ అనిపించుకుంటున్నారు. వీరిద్దరు విడిపోయారనే రూమర్లు కూడా బాగానే చక్కర్లు కొట్టాయి. అయితే, బిగ్ బాస్‌కు వచ్చే ముందు ఇద్దరు చాలా క్లోజ్ ఉన్న వీడియోలు చక్కర్లు కొట్టడంతో వారు ఇంకా ప్రేమలోనే ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఈ జంట అభిమానులు ఎలాగైనా సరే.. షణ్ముఖ్‌ను విజేతగా చూడాలని కోరుకుంటున్నారు. గుడ్ లక్ షన్ను. 

Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!

Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ 

Also Read: బిగ్ బాస్.. ఈ లేడీస్‌కు కాస్త పూలు చూపించు.. అబ్బాయిలు క్లాస్, అమ్మాయిలు ఊర మాస్!

టాప్ హెడ్ లైన్స్

Singer Janaki Passed Away: దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
Naga Chaitanya: హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
Operation Safed Sagar Series OTT : ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget