అన్వేషించండి

Mahesh Babu: జిమ్‌లో మహేష్ బాబు వర్కవుట్ - ఫొటో వైరల్!

మహేష్ కాస్త బాడీ పెంచే పనిలో ఉన్నారు. జిమ్ లో అతడు వర్కవుట్ చేస్తూ కనిపించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది. ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు మహేష్ బాబు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. 

ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తుంది. దీనికోసం ఫిట్ నెస్ మెయింటైన్ చేసే పనిలో పడ్డారు. డిసెంబర్ లో షూటింగ్ మొదలయ్యేలా ఉంది. ఈ షెడ్యూల్ లో ఫైట్స్ ను చిత్రీకరించే అవకాశం ఉంది. దానికోసమే మహేష్ కాస్త బాడీ పెంచే పనిలో ఉన్నారు. జిమ్ లో అతడు వర్కవుట్ చేస్తూ కనిపించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మహేష్ సినిమాలో ఐటెం సాంగ్:
తొలిసారి మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్న మాట నిజమేనని.. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని.. త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు నాగవంశీ. ఆయన ఇంకా ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' రెండూ థియేటర్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయని.. కానీ టీవీలో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయని చెప్పారు. 
 
ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నాగవంశీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి!

#SSMB28Aarambham:
ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందు, షూటింగ్ మొదలైన తరువాత.. సినిమాకి టైటిల్ ఇదేనంటూ చాలా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. షూటింగ్ మొదలుపెట్టిన రోజు #SSMB28Aarambham అంటూ మేకర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ వదలడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ ఇచ్చేశారని అందరూ భావించారు. 'ఆరంభం'(Aarambham) అనేది  సినిమా టైటిల్ అని.. అందుకే అలా ట్యాగ్ చేశారంటూ ఆ టైటిల్ ను ట్రెండ్ చేశారు.
 
'అయోధ్యలో అర్జునుడు':
మేకర్స్ మాత్రం ఈ టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు ఇద్దరి సెంటిమెంట్ కలగలిసేలా 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదివరకు త్రివిక్రమ్ సినిమాల టైటిల్ విషయంలో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే. ఒక టైటిల్ ను వారే క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేవారు. ఆ టైటిల్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి టైటిల్ మార్చడమా..? ఫైనల్ చేయడమా..? అనే విషయంలో నిర్ణయం తీసుకునేవారు. మరిప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ ను ఫైనల్ చేస్తారో లేదో చూడాలి! 

Also Read : 'లైగర్' గాయాలు - ఎనిమిది నెలల తర్వాత

టాప్ హెడ్ లైన్స్

Iduppu Kayitham: ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?
ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?
K Bhagyaraj: తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
Varanasi Update : వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
Karthika Deepam 2 Serial Today June 27th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని కఠినంగా శిక్షించమని కన్న తల్లి చెప్పడానికి కారణమేంటి? జ్యోత్స్నకి దీప అంటే చాలా ఇష్టమా.. ఇదేం ట్విస్టూ!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని కఠినంగా శిక్షించమని కన్న తల్లి చెప్పడానికి కారణమేంటి? జ్యోత్స్నకి దీప అంటే చాలా ఇష్టమా.. ఇదేం ట్విస్టూ!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
K Bhagyaraj: తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
Varanasi Update : వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
ఈ వర్షాల్లో టూ వీలర్ నడిపేవారికి అలర్ట్ - ఈ తప్పులు చేస్తే తప్పదు ప్రమాదం!
వర్షాకాలంలో బైక్ రైడింగ్ చిట్కాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సేఫ్!
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
Kalki 2898AD : ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
Embed widget