Mahesh Babu Movie Update : మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ షేర్ చేసిన ప్రొడ్యూసర్ నాగవంశీ
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్‌ను ప్రొడ్యూసర్ నాగవంశీ షేర్ చేసహ్రు.
![Mahesh Babu Movie Update : మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ షేర్ చేసిన ప్రొడ్యూసర్ నాగవంశీ Mahesh Babu's SSMB28 Movie 1st Schedule Completed with Action Scenes 2nd Schedule Starts Post Dussehra Mahesh Babu Movie Update : మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ షేర్ చేసిన ప్రొడ్యూసర్ నాగవంశీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/c8ccf5ed877054e38dbbb8330dd5dc261663751157536313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో హ్యాట్రిక్ సినిమా (SSMB 28) సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ నెల 12న షూటింగ్ స్టార్ట్ చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ గురించి కూడా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు ప్రొడ్యూసర్ నాగవంశీ.
దసరా తర్వాత రెండో షెడ్యూల్...
''SSMB 28 మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. కొన్ని భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేశాం. అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీ చేసిన అన్బరివు (Anbariv) లకు థాంక్స్. దసరా తర్వాత రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, బుట్టబొమ్మ పూజా హెగ్డే జాయిన్ అవుతారు'' అని ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేశారు.
రెండో షెడ్యూల్‌లో జాయిన్ కానున్న పూజ!
మహేష్ బాబు సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా అనే సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్ తీయడం వల్ల ఆమె జాయిన్ కాలేదు. రెండో షెడ్యూల్ నుంచి హీరోతో పాటు షూటింగ్ చేయనున్నారు. ఇంతకు ముందు 'మహర్షి' సినిమాలో వాళ్ళిద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఆల్రెడీ విడుదలైన మహేష్ లుక్స్ ప్రేక్షకులకు నచ్చాయి. పూజ హెగ్డే లుక్ ఎలా ఉంటుందో చూడాలి.
బస్‌లతో ఫైట్... సూపర్ మాస్!
SSMB 28లో యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ కానున్నాయని టాక్. మహేశ్ కోసం త్రివిక్రమ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. ఇప్పుడు ఆ ఫైట్స్‌ను అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు. మహేష్ డేర్ డెవిల్ స్టంట్స్ చేశారట. ఘట్టమనేని ఫ్యాన్స్, ప్రేక్షకులకు ఈ ఫైట్స్ సూపర్ కిక్ ఇస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
త్రివిక్రమ్ మాస్ అంటే మామూలుగా ఉండదు!
మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అతడు'లో పొలంలో తీసిన ఫైట్ మాసీగా ఉంటుంది. అలాగే, 'జల్సా'లో ముఖేష్ రుషి పొలంలో ఉత్తరాది మనిషిని బెదిరించే సీన్... 'అరవింద సమేత వీరరాఘవ'లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ కూడా చాలా మాసీగా ఉంటాయి. బావుంటాయి. అందువల్ల, మహేశ్ బాబు లేటెస్ట్ మూవీలో మాస్ ఫైట్ అనేసరికి అభిమానుల్లో అంచనాలు పెరగడం సహజం.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.
Also Read : ముందుంది అసలైన యుద్ధం - రంగంలోకి దిగిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)