News
News
X

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన కూతురు అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. తాజాగా ఆమెకు డాటర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

FOLLOW US: 
 
నాలుగు పదుల వయసు దాటినా.. రోజు రోజుకు మరింత యంగ్ గా కనిపిస్తున్న మహేష్ బాబు.. వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా.. సైలెంట్ గా తన పని తాను చేసుకుపోవడంతో ముందుంటాడు మహేష్ బాబు. తాజాగా ఆయన నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది.  

అటు ఇవాళ వరల్డ్ డాటర్స్ డే సందర్భంగా.. తన కూతురుకు శుభాకాంక్షలు చెప్పాడు మహేష్ బాబు. “నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే నా చిన్నారి సితార ఘట్టమననేనికి డాటర్స్ డే శుభాకాంక్షలు” అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. వాస్తవానికి తన కూతురు సితార అంటే మహేష్ బాబుకు ఎంతో ఇష్టం. వీరిద్దరు కలిసి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంటారు. కొద్ది రోజులుగా పలు టీవీ షోలలోనూ ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. అటు తండ్రితో కలిసి చేసిన అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంది సితారు. తాజాగా మహేష్ బాబు పోస్టుకు నెటిజన్లు భారీగా రెస్పాంట్ అవుతున్నారు. తండ్రీ కూతుళ్ల ప్రేమకు నిజమైన నిర్వచనం మీరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హ్యాపీ డాటర్స్ డే అంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram
 
A post shared by Mahesh Babu (@urstrulymahesh)

News Reels

మహేష్ బాబు తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. మహేష్ బాబు 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శరవేగంగా  షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా దాదాపుగా ఐదు భాషల్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో ఒకేసారి వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడట.  మహేష్, త్రివిక్రమ్ కాంబోలో అతడు,  ఖలేజా  సినిమాలు వచ్చాయి.  సుమారు 11 ఏండ్ల తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగాయి.  ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నట్లు తెలుస్తున్నది.  మహేష్ బాబుకు అంకుల్ పాత్రలో ఆయన కనిపిస్తారట. 

Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ

Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

Published at : 25 Sep 2022 04:25 PM (IST) Tags: Sitara Ghattamaneni Daughters Day 2022 Mahesh Babu Ghattamaneni Daughter day wishes

సంబంధిత కథనాలు

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్  శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?

Urvasivo Rakshasivo OTT Release : ఆహా ఓటీటీలోకి 'ఊర్వశివో రాక్షసివో' - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్