అన్వేషించండి
Advertisement
Tollywood Movies : ఆటల్లో పడిపోయిన తారలు.. వెయిటింగ్ లో అభిమానులు!
ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాటలోనే మరికొన్ని సినిమాలను రూపొందించబోతున్నారు దర్శకనిర్మాతలు.
ప్రస్తుతం అందరి దృష్టి టోక్యో ఒలింపిక్స్ పైనే పడింది. బ్యాడ్మింటన్ లో సింధు, ఆర్చరీలో దీపికా కుమారి, బాక్సింగ్ లో మేరికోమ్ ఇలా మన టాలెంటెడ్ ప్లేయర్స్ తమ సత్తా చాటతారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనాలు. ఎక్కడ చూసినా వీటికి సంబంధించిన చర్చలే నడుస్తున్నాయి. అయితే ఈ ఆతల సందడి విశ్వవేదికపైనే కాదు.. బాక్సాఫీస్ బరిలో కూడా కనిపిస్తోంది. వెండితెరపై తమ ఆటలతో ఎంటర్టైన్ చేయడానికి మన హీరోలు సిద్ధమవుతున్నారు. థియేటర్లలో తమ సినిమాలతో ఆటగాళ్లుగా అలరించడానికి రెడీ అవుతోన్న హీరోలెవరో, ఆ సినిమా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం!
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఆటల సందడి మొదలైపోయింది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించిన 'తుఫాన్ ', అలానే ఆర్య నటించిన 'సార్పట్ట' సినిమాలు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు అమెజాన్ లో విడుదల కాగా.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడీ బాక్సింగ్ పరంపరను కొనసాగిస్తూ.. బాక్సాఫీస్ వేదికగా సత్తా చాటడానికి సెట్స్ పై రెడీ అవుతున్నారు తారలు. టాలీవుడ్ యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ లు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయబోతున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా కోసమే రింగ్ లోకి దిగి ఫైట్ చేయబోతున్నారు విజయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే వరుణ్ తేజ్ 'గని' సినిమా కోసం బాక్సర్ గా మారారు. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్నో నెలలుగా కసరత్తులు చేస్తున్నాడు వరుణ్. తన లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమా కూడా చివరి దశకు చేరుకుంది.
నటి కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖీ' సినిమాతో బాక్సాఫీస్ ముందు షూటర్ గా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాను నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేశారు. రైఫిల్ షూటింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న క్రీడా చిత్రమిది. ఇందులో కీర్తి గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఓ మారుమూల పల్లెలో పుట్టి పెరిగిన ఆమె.. షూటర్ గా మారి తన ఆటతో ఊరికి, తన కుటుంబానికి ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందనేదే సినిమా. ఈ సినిమాలో కీర్తి సురేష్ కోచ్ గా జగపతిబాబు నటిస్తున్నారు.
గతంలో 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాలో కబడ్డీ ప్లేయర్ కనిపించాడు నాని. ఆ తరువాత 'జెర్సీ' సినిమాలో క్రికెటర్ గా అలరించాడు . ఇప్పుడు ఆయన ఫుట్ బాల్ ప్లేయర్ గా మారడానికి రెడీ అవుతున్నాడట. ఓ యంగ్ డైరెక్టర్ ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. హాకీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో వైష్ణవ్.. హాకీ ప్లేయర్ గా కనిపిస్తారని సమాచారం.
దర్శకుడు బుచ్చిబాబు సాన 'ఉప్పెన'తో దర్శకుడిగా తన మార్క్ సృష్టించగలిగాడు. ఇప్పుడు తన రెండో సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించనున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాటలోనే మరికొన్ని సినిమాలను రూపొందించబోతున్నారు దర్శకనిర్మాతలు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రైమ్
విజయవాడ
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion