Lokesh Kanagaraj: ‘సింగపూర్ సెలూన్‘లో లోకేష్ కనగరాజ్, మరో కొత్త సబ్జెక్ట్‌తో వస్తున్న ‘అమ్మోరుతల్లి’ హీరో
Singapore Saloon trailer: ఆర్జే బాలాజీ తాజా చిత్రం ‘సింగపూర్ సెలూన్‘. ఈ మూవీలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లోనూ ఆయన కనిపించారు.
Director Lokesh Kanagaraj in RJ Balajis Singapore Saloon: RJగా కెరీర్ మొదలు పెట్టిన బాలాజీ, హాస్య నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పలు సినిమాల్లో చక్కటి కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఆ తర్వాత హీరోగానూ, దర్శకుడిగానూ సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సింగపూర్ సెలూన్’. గోకుల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరీ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, లాల్, జీవా కీలక పాత్రల్లో కనిపించగా, దర్శకుడు లోకేష్ కనకరాజ్ అతిథి పాత్ర చేస్తున్నారు.
‘సింగపూర్ సెలూన్’లో లోకేష్ అతిథిపాత్ర
తాజాగా ‘సింగపూర్ సెలూన్’కు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో లోకేష్ కనగరాజ్ కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. సింగ్ పూర్ లో సెలూన్ ఓపెనింగ్ వేడుకకు ఆయన చీఫ్ గెస్టుగా వచ్చినట్లు చూపించారు. లోకేష్ ఈ సినిమాలో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు తీసే లోకేష్ తొలిసారి ఓ సినిమాలో కనిపించడం థ్రిల్ గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి లోకేష్ కగనరాజ్, ఆర్జే బాలాజీ మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ‘మా నగరం’ సినిమా విడుదల సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు బాలాజీ వెల్లడించారు. అప్పటి నుంచి ఇద్దరు మంచి మిత్రులుగా మారినట్లు తెలిపారు. ఆ స్నేహంతోనే ఈ సినిమాలో ఆయన అతిథి పాత్ర పోషించినట్లు వెల్లడించారు. లోకేష్ నిర్మించే ఓ సినిమాలో తాను ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చినా, కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పారు.
ఈ నెల 25న ‘సింగపూర్ సెలూన్’ విడుదల
ఇక చదువుకుంటున్న రోజుల్లోనే హెయిర్ స్టైలిస్ట్ కావాలని ఆశపడే ఒక సాధారణ వ్యక్తి కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందినట్లు బాలాజీ తెలిపారు. ‘సింగపూర్ సెలూన్’ చిత్రం తన కెరీర్‌లో 10 కాలాల పాటు గుర్తుండిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం హెయిర్ స్టైలిస్ట్ గా కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిపారు. ‘సింగపూర్ సెలూన్’ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంది. వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా కంప్లీట్ చేసుకుంది. క్లీన్ U సర్టిఫికేట్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి కోలీవుడ్ రిలీజ్ రైట్స్ ను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తీసుకుంది.
‘తలైవా 171’ సినిమా పనుల్లో లోకేష్ బిజీ
లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా ‘లియో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దళపతి, త్రిష హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ‘తలైవా 171’ సినిమా చేస్తున్నారు.
Read Also: ‘హనుమాన్‘ సినిమా ఓ అద్భుత కళాఖండం, కేంద్ర మంత్రుల ప్రశంసల జల్లు