అన్వేషించండి

Lokesh Kanagaraj: ‘లియో 2‘ పట్టాలెక్కేది అప్పుడే, క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు లోకేష్

Lokesh Kanagaraj: ‘దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లియో’ రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ కీలక అప్ డేట్ ఇచ్చారు.

Lokesh Kanagaraj About Leo 2: ‘తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘లియో’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపించింది. విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో చేరింది. ఈ నేపథ్యంలో ‘లియో’కు సీక్వెల్ ఉంటుందని గత కొంతకాలంగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. తాజాగా దర్శకుడు లోకేష్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

‘లియో 2’ కచ్చితంగా ఉంటుంది- లోకేష్

ఇంతకాలం ‘లియో’ సీక్వెల్ మీద వస్తున్న వార్తలను దర్శకుడు లోకేష్ నిజమేనని చెప్పారు. “’లియో 2’ కచ్చితంగా వస్తుంది. కానీ, ఇప్పుడు కాదు. ప్రస్తుతం ‘తలైవా 171’, ‘ఖైదీ 2’ సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలు పూర్తైన తర్వాత ‘లియో 2’ మొదలవుతుంది” అని చెప్పారు. ఈ కామెంట్స్ తో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విజయ్ కెరీర్ లో 67వ చిత్రంగా తెరకెక్కిన ‘లియో’లో త్రిష హీరోయిన్ గా నటిచింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అదించారు.  

‘తలైవా 171’ పనుల్లో బిజీ బిజీ

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ‘తలైవా 171’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని దర్శకుడు లోకేష్ భావిస్తున్నారు. ఏప్రిల్ 2024లో షూటింగ్ మొదలు పెట్టి, దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో తమిళ హీరో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.  తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. 'జైలర్' తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి.

వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్న విజయ్

మరోవైపు దళపతి విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘దళపతి 68’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Read Also: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget