అన్వేషించండి

What Is Korean Drama: కొరియన్ డ్రామాలో ఏముంటుంది, కే డ్రామాలంటే ఎందుకు అంత పిచ్చి.. వాటి ప్రత్యేకత ఏంటి?

What is Korean Drama all about | కొరియన్ డ్రామాలు (K Drama) భారత్‌లోనూ బాగా ప్రాచుర్యం పొందాయి. అందుకు కారణాలు ఏమిటి? ప్రజలు కే డ్రామాలను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారు.. కారణాలు ఇక్కడ తెలుసుకోండి.

What is K Drama: ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో కొరియా డ్రామా గేమ్స్ తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ కుటుంబానికి ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు కొరియన్ లవర్ గేమ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవానికి, K-పాప్, K-డ్రామా (Korean Drama) అభిమానులు ఈ రకమైన గేమ్స్ పట్ల త్వరగా ఆకర్షితులవుతారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాడి మందిని ఆకర్షించేలా ఈ కొరియన్ డ్రామాలో ఏముంది? వాటిపై ఎందుకంత ఆసక్తి చూపుతారో ఇక్కడ  తెలుసుకుందాం.

స్ట్రాంగ్ కల్చర్, ఎమోషనల్ బాండింగ్ 

 కొరియన్ డ్రామాలకు పెద్దలతో పాటు చిన్నారులు సైతం వాటి పట్ల ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం వాటిలో ఉన్న కొరియా సాంస్కృతిక గుర్తింపు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, పెద్దల పట్ల గౌరవం, భావోద్వేగ అంశాలు, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన భారత ప్రేక్షకులకు తమది అనే భావన కలుగుతుంది. ప్రేక్షకులు తరచుగా ఈ కథలలో తమ జీవితాలను చూసుకుంటారు. కఠినమైన తల్లిదండ్రులు, చెప్పలేని ప్రేమ, తోబుట్టువుల బాధ్యత, సమాజ ఒత్తిడి లాంటి అంశాలు వారిని ప్రభావితం చేస్తాయి. 

చిన్న కథలు.. కానీ క్లారిటీగా ఉంటాయి 

అనేక విదేశీ సిరీస్‌ల తరహాలో కాకుండా ఇవి చాలా కాలం పాటు నడుస్తాయి. చాలా కొరియన్ డ్రామాలలో స్పష్టత ఉంటుంది. మధ్యలో అయినా, ముగింపు అయినా క్లారిటీగా చూపిస్తారు. సాధారణంగా 16 నుండి 20 ఎపిసోడ్‌లలో ముగిసే కథ ఒకే సీజన్‌లో కంప్లీట్ అవుతుంది. దాంతో కొరియన్ డ్రామాలు పెద్దలతో పాటు పిల్లలను ఆకట్టుకుంటాయి. కొన్ని లవర్ గేమ్స్ టాస్కులు ఇస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాయి. 

భావోద్వేగాలతో కూడిన స్టోరీ  

కొరియన్ డ్రామాలు తమ భావోద్వేగాలను అసాధారణంగా చూపిస్తాయి. లవ్, హార్ట్ బ్రేకింగ్ స్టోరీలు, ఒంటరితనం, జీవితంపై ఆశ లాంటివి నిజాయితీగా చూపిస్తారు. మానసిక నిపుణులు ఈ ప్రదర్శనలు భావోద్వేగంతో కూడిన ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంటారు. ముఖ్యంగా ఒత్తిడి లేదా ఒంటరితనంతో బాధపడుతున్న వారికి కే డ్రామాలు బాగు నచ్చుతాయి. 

క్వాలిటీ విజువల్స్, ఆకట్టుకునే మ్యూజిక్ 

కే డ్రామాలు, కే లవ్ డ్రామా గేమ్స్ విజువల్స్ చాలా క్లారిటీగా ఉంటాయి. కొరియన్ డ్రామాలు చూస్తుంటే అట్టే స్క్రీన్లకు అతుక్కుపోతారు. వీటిలో జాగ్రత్తగా ఫ్రేమ్ చేసిన సన్నివేశాలు, సింపుల్ లైటింగ్, సినిమాటిక్ లుక్ ఫీల్ ఉన్నాయి. వీటితో పాటు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సూపర్ సౌండ్‌ట్రాక్‌లు కూడా ఉన్నాయి. 

అన్ని వయసుల వారికి క్లీన్ కంటెంట్ 

చాలా బోల్డ్ సీన్లపై ఆధారపడే ఇతర దేశాల షోస్ తరహాలో కాకుండా, కొరియన్ డ్రామాలు సాధారణంగా భావోద్వేగ కంటెంట్, సాన్నిహిత్యంపై ఎక్కువ దృష్టిసారిస్తాయి. బోల్డ్ సీన్లు, న్యూడిటీ కంటే అద్భుతమైన హావభావాలు, సంభాషణలు లాంటివి ప్రదర్శిస్తారు. దాంతో  ఇది ఈ డ్రామాను అన్ని వయసుల వారిని ఆకర్షించడంతో పాటు చూసేందుకు సౌకర్యవంతంగా చేస్తుంది.

ఫ్యాషన్, మోడ్రన్ లైఫ్‌స్టైల్  

K-డ్రామాలు ఓ డ్రామా, సినిమాలాగ అనిపించవు. అవి ఒక జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతాయి. ప్రేక్షకులు స్టైలిష్ డ్రెస్సింగ్, కూల్‌గా ఉండే కేఫ్‌లు, రోమన్ లాంటి స్ట్రీట్ ఫుడ్, రోజువారీ కొరియన్ జీవితానికి ఆకర్షితులవుతారు. ఈ అంశాలు పలు దేశాల్లో అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ వారికి అభిమానులను పెంచడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నాయి. కే డ్రామాలు సాఫ్ట్ కల్చరల్ అంబాసిడర్‌లుగా మారుతున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Embed widget