RRR Animated Movie : 'బాహుబలి' బాటలోనే 'RRR' - యానిమేటెడ్ మూవీ కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Rajamouli : మూవీ లవర్స్‌కు దర్శక ధీరుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. బాహబలి తరహాలోనే బ్లాక్ బస్టర్ 'RRR' మూవీకి కూడా యానిమేషన్ వెర్షన్ తీసుకు రావాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

Rajamouli Reaction On RRR Animated Movie : తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీ అంటే మనకు గుర్తొచ్చేది దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'. వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ యానిమేటెడ్ సిరీస్ కూడా రూపొందుతోంది. ఇప్పుడు ఇదే బాటలో కూడా 'RRR' కూడా రానుంది.
కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
ఈ విషయాన్ని రీసెంట్‌గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి కన్ఫర్మ్ చేశారు. 'RRR'ను యానిమేటెడ్ మూవీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం అనేక జపనీస్ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నీ కుదిరితే త్వరలోనే కొత్త యానిమేటెడ్ మూవీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'RRR' వరల్డ్ వైడ్‌గా సంచలన విజయం సాధించింది. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ మూవీకి యానిమేటెడ్ వెర్షన్ వస్తుందనే ప్రకటనతో హైప్ క్రియేట్ అవుతోంది.
త్వరలోనే 'బాహుబలి : ది ఎటర్నల్ వార్'
'బాహుబలి : ది ఎటర్నల్ వార్' సరికొత్త కథాంశంతో యానిమేటెడ్ సిరీస్ కూడా రూపొందుతోంది. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తుండగా... ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. అమరేంద్ర బాహుబలి మరణానంతరం రాక్షసులు, దేవతల మధ్య 14 రాజ్యాల్లో సాగే యుద్ధమే ప్రధానాంశంగా దీన్ని రూపొందిస్తున్నారు.
'బాహుబలి మరణం ఒక ముగింపు కాదు. ఓ మహా కార్యానికి ప్రారంభం. తన గమ్యం యుద్ధం. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను శాసించే దేవాసుర సంగ్రామం.' అంటూ టీజర్‌లో ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవల్‌లో ఉంది. ఈ ఏడాదే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
























