Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్ తండ్రి ఆవేదన!
నటి కీర్తి సురేష్ ఓ ఫ్రెండ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ఇతడే కాబోయే ఆమె భర్త అంటూ పలు వెబ్ సైట్లు వార్తలు రాశాయి. ఈ వార్తలపై ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
![Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్ తండ్రి ఆవేదన! Keerthy Suresh's Father On Rumours About Her Love Life With Farhan Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్ తండ్రి ఆవేదన!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/28/ea9d3f0bc0caaada4a1f4c0affb76f431685277137433544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మహానటి కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతోందని యూట్యూబ్ చానెళ్లు వార్తలను వండి వడ్డిస్తున్నాయి. తాజాగా ఆమె తన స్నేహితుడితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఇతడే ఆమె చేసుకోబోయే వరుడు అంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. పలు సైట్లు రకరకాలుగా వార్తలు రాస్తున్నాయి. ఇప్పటికే ఈ వార్తలను కీర్తి సురేష్ ఖండించింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పింది. అయినా, ఈ వార్తలకు అడ్డుకట్ట పడటం లేదు.
మనఃశాంతి కరువు అవుతోంది- కీర్తి సురేష్ తండ్రి
ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ తండ్రి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. కీర్తి గురించి వస్తున్న వాస్తలన్నీ అవాస్తవాలని ప్రకటించారు. ఈ వార్తల కారణంగా తమ మనఃశాంతి కరువవుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఇటీవల కీర్తి సురేష్ తన స్నేహితుడితో దిగిన ఫొటోపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ అబ్బాయి కీర్తికి మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు. అతడి పేరు ఫర్హాన్. ఇటీవల తన బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా కీర్తి ఓ ఫోటో షేర్ చేస్తూ అతడికి బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ ఫోటోను బేస్ చేసుకుని ఓ తమిళ మీడియా సంస్థ బేస్ లెస్ వార్త ప్రసారం చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అన్ని చానెల్స్ లో వార్తలు వచ్చాయి. కీర్తి పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. కీర్తి పెళ్లి ఫిక్స్ అయితే, మేమే స్వయంగా మీడియాకు చెప్తాం. అనవరసరంగా సున్నితమైన విషయాల గురించి రూమర్స్ ప్రసారం చేయడం మంచిది కాదు. ఇలాంటి వార్తల కారణంగా మా కుటుంబ సభ్యుల మన:శాంతి కరువు అవుతుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చిన కీర్తి
ఇప్పటికే ఈ వార్తలపై కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. ఫోటోలో ఉన్న అబ్బాయితో పెళ్లి జరగబోతుందని వస్తున్న వార్తలను ఆమె తప్పుబట్టింది. “అతను నా స్నేహితుడు మాత్రమే. ఈ వార్తల్లోకి అనవసరంగా అతడిని లాగారు. నిజమైన మిస్టరీ మ్యాన్ ను అవసరం అయిన సమయంలో అందరికీ పరిచయం చేస్తాను. అప్పటి వరకు అందరూ చిల్ గా ఉండాలి. అనవసరంగా మీడియా అవాస్తవాలను ప్రసారం చేయడం మానుకోవాలి. ఇలాంటి విషయాల్లో కాస్త ఆలోచించి వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుంది” అని కీర్తి సురేష్ హితవు పలికింది.
Hahaha!! Didn’t have to pull my dear friend, this time!
— Keerthy Suresh (@KeerthyOfficial) May 22, 2023
I will reveal the actual mystery man whenever I have to 😉
Take a chill pill until then!
PS : Not once got it right 😄 https://t.co/wimFf7hrtU
ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు కీర్తి మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.
Read Also: చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)