అన్వేషించండి

Tejas OTT Release: ఓటీటీలోకి కంగనా ‘తేజస్‘, స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

Tejas OTT Release: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన రీసెంట్ మూవీ ‘తేజస్‘ ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏ ఓటీటీలోకి.. ఎప్పుడు వస్తుందంటే?

Tejas OTT Release: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘తేజస్’. అక్టోబర్ 27వ థియేటర్లలో విడుదల అయ్యింది. సర్వేశ్ మేవారా దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో, కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటించింది. సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ ఊహించారు. అయితే, బాక్సాఫీస్ దగ్గర అనుకు స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. వసూళ్ల పరంగానూ సత్తా చాటలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది.   

జనవరి 5న జీ5లో స్ట్రీమింగ్

‘తేజస్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. జీ5 ఓటీటీ వేదికగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 5 2024 నాడు స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని జీ5 అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ విడుదల చేసింది. అయితే, ఈ సినిమా ఎన్ని భాషల్లో విడుదల అవుతుంది? అనే విషయాన్ని మాత్రం సదరు ఓటీటీ సంస్థ ప్రకటించలేదు. 2016లో భారత వైమానిక దళంలోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించింది భారత ప్రభుత్వం. ఈ అంశాన్ని కథాంశంగా చేసుకుని ‘తేజస్’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కంగనా ఎయిర్ ఫోర్స్ ఫైలెట్ గా కనిపించింది. శత్రుదేశం పాకిస్తాన్ లో చేపట్టే ఓ ఆపరేషన్ లో ఆమె పాల్గొంటుంది. అయితే, ఈ సినిమా సుమారు రూ. 60 కోట్లతో తెరకెక్కింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ. 10 కోట్లు వసూళు చేసింది. కంగనా కెరీర్ లోనే ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. 

ఆకట్టుకోని ‘చంద్రముఖి 2’

‘తేజస్’ కంటే ముందు కంగనా నటించిన ‘చంద్రముఖి 2’ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘చంద్ర‌ముఖి’కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీర‌వాణి సంగీతం అందించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మాణంలో భారీ అంచ‌నాల న‌డుమ సెప్టెంబ‌ర్ 28న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సుమారు రూ.60 కోట్ల‌ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ. 40 కోట్లు వసూళు చేసింది. నిర్మాతలకు పెద్దమొత్తంలో నష్టాన్ని కలిగించింది.

ఆశలన్నీ ‘ఎమర్జెన్సీ’ మీదే!

ప్రస్తుతం కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమా చేస్తోంది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కంగనా ఇందిరా గాంధీగా కనిపించబోతోంది. ఈ సినిమాకు కంగనా దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచింది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.  

Read Also: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?

టాప్ హెడ్ లైన్స్

Pavala Shyamala Final Rites: ఖర్చులన్నీ 'మా'వే... పావలా శ్యామల అంత్యక్రియలకు ముందుకొచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
ఖర్చులన్నీ 'మా'వే... పావలా శ్యామల అంత్యక్రియలకు ముందుకొచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
Podarillu Serial Today July 28th:ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
Jana Nayagan Collections: సోమవారం వచ్చింది పది కోట్లే... ఐదు రోజుల్లో 'జన నాయకుడు' టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
Jana Nayagan Five Days Collection: బాక్సాఫీస్‌లో విజయ్‌కు ఎదురీత... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget