Jr NTR: 'ఆర్ఆర్ఆర్' కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన ఫ్యాన్స్, ఎక్కడంటే?

ఫ్లోరిడాలోని ఎన్టీఆర్ అభిమానులు కొందరు 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రీమియర్ షో చూడడానికి ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారట.

FOLLOW US: 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో 'రాధేశ్యామ్', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు విడుదల కానున్నాయి. మార్చి 11న 'రాధేశ్యామ్', మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదల కానున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' సినిమా టికెట్ల బుకింగ్ మొదలై రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేసిన ఈ సినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ కావడానికి రెండు వారాలకు పైగా సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే ఈ సినిమా టికెట్స్ ఓ రేంజ్ లో అమ్ముడైపోతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఏకంగా థియేటర్ మొత్తాన్నే కొన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అది అమెరికాలో చోటుచేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

ఫ్లోరిడాలోని ఎన్టీఆర్ అభిమానులు కొందరు 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రీమియర్ షో చూడడానికి ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారట. ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్‌సెల్‌టౌన్‌లో సాయంత్రం 6 గంటల షో కోసం అన్ని ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాను అందరూ కలిసి చూడాలనే ఉద్దేశంతో కొందరు అభిమానులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రీమియర్ షోలో ఎంత హంగామా చేస్తారో మరి. 

ఇక డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

Published at : 07 Mar 2022 04:45 PM (IST) Tags: RRR ram charan America Jr NTR NTR fans RRR Premier shows

సంబంధిత కథనాలు

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!