John Abraham: నేను బాలీవుడ్ హీరోని, తెలుగు సినిమాల్లో నటించేదే లేదు - జాన్ అబ్రహం కామెంట్స్
తను ఎలాంటి తెలుగు సినిమాలో నటించడం లేదని.. ఎప్పటికీ ప్రాంతీయ సినిమాల్లో నటించనని చెప్పారు జాన్ అబ్రహం.

తాను బాలీవుడ్ హీరోనని రీజనల్ సినిమాల్లో నటించేదే లేదని తేల్చి చెప్పారు జాన్ అబ్రహం. ఆయన హీరోగా తెరకెక్కిన 'ఎటాక్' అనే సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు జాన్ అబ్రహం. ఇంటర్వ్యూలో భాగంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. ఇదే సమయంలో 'సలార్' సినిమాలో ఆయన నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్లపై స్పందించారు.
తను ఎలాంటి తెలుగు సినిమాలో నటించడం లేదని.. ఎప్పటికీ ప్రాంతీయ సినిమాల్లో నటించనని చెప్పారు. తనొక బాలీవుడ్ హీరోనని.. ఎప్పటికీ ఇతర భాషల్లో సెకండ్ హీరోగా, సహనటుడు పాత్రలు చేయనని చెప్పారు. ఇతర నటుల మాదిరి డబ్బు కోసం తెలుగు లేదా మరే ఇతర రీజనల్ సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా 'సలార్'లో జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో జాన్ లేడనే విషయం స్పష్టమైంది. ఇదిలా ఉండగా.. షారుఖ్ ఖాన్ నటిస్తోన్న 'పఠాన్' సినిమాలో జాన్ అబ్రహం నటిస్తున్నారు. అలానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే స్పెయిన్ కి వెళ్లబోతున్నట్లు చెప్పారు. ఇక 'ఎటాక్' సినిమాలో జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య రాజ్ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
Also Read: ఎన్టీఆర్ 8 కిలోల టార్గెట్, కొత్త లుక్ కోసం స్పెషల్ వర్కవుట్
Also Read: విజయ్-వంశీ పైడిపల్లి సినిమాలో హీరోయిన్ మారిందా?
View this post on Instagram
Before You Go
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















