అన్వేషించండి

Yatra 2: వైయస్ జగన్‌ను కలవలేదు, ఏపీ రాజకీయాలు తెలియదు కానీ...

Jiiva On Yatra 2 Movie: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాను ఎప్పుడూ కలవలేదని హీరో జీవా తెలిపారు. తనకు రాజకీయాలు కూడా తెలియని చెప్పారు. మరి, సినిమా ఎలా చేశారంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తాను ఎప్పుడూ కలవలేదని కోలీవుడ్ కథానాయకుడు జీవా తెలిపారు. తనకు ఏపీ రాజకీయాల గురించి కూడా అవగాహన లేదన్నారు. మరి, సినిమా ఎలా చేశారని ప్రశ్నిస్తే... ''నేను కథను, అందులో కథానాయకుడి పాత్రను అర్థం చేసుకున్నాను'' అని సమాధానం చెప్పారు‌. జగన్ పాత్రలో జీవా నటించిన సినిమా 'యాత్ర 2'. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు.

జగన్ రోల్ చేయడం టఫ్ టాస్క్! కానీ... 
''యాత్ర 2'ను పూర్తిగా బయోపిక్ అనలేం. ఇది నాయకుడి జీవితానికి సంబంధించిన పార్షియల్ బయోపిక్. దర్శకుడు మహి వీ రాఘవ్ ఈ కథలో మానవ సంబంధాలు, అనుబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. రాజకీయాలలోకి ఎక్కువగా వెళ్లలేదు'' అని జీవా చెప్పారు. తనకు తెలుగు మాట్లాడడం రాదని, తాను ఏపీ రాజకీయాలను ఫాలో కానని, అందువల్ల జగన్ పాత్రలో నటించడం కాస్త కష్టమైన పని అని జీవా చెప్పుకొచ్చారు. అయితే‌..‌. జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సమాచారం మీడియాలో అందుబాటులో ఉండడంతో పాటు దర్శకుడు చెప్పిన విషయాలను ఫాలో కావడం వల్ల తన పని సులువైందని ఆయన వివరించారు.

'యాత్ర 2' చేయడానికి తొలుత సందేహించా!
రాజకీయ సినిమా కావడంతో 'యాత్ర 2' చేయడానికి తొలుత తాను సందేహించానని జీవా తెలిపారు. అయితే...‌ మహి వీ రాఘవ్ ఈ సినిమా కంటే ముందు తీసిన 'యాత్ర' చూసిన తర్వాత తనకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్నారు. ఇంకా ఈ సినిమా, దర్శకుడు మహి గురించి జీవో మాట్లాడుతూ... ''రాజకీయ నేపథ్యమున్న కథలను తీసుకుని సినిమాలు తెరకెక్కించడంలో మహికి ఒక సపరేట్ స్టైల్, క్లాస్ ఉన్నాయి. తండ్రికిచ్చిన మాటను నెరవేర్చడం కోసం ఒక కొడుకు ఏం చేశాడు? ఆ క్రమంలో, ఆ ప్రయాణంలో ఆ కొడుకు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? అనేది మా సినిమాలో ప్రధాన అంశం'' అని తెలిపారు. 

జగన్... జీవా... ఇద్దరి మధ్య పోలికలు!
ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ మంది ప్రజలకు తెలుసు. ఆ తర్వాత ఆయనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. జీవా విషయానికి వస్తే... ఆయన హీరో అవ్వడానికి ముందు నిర్మాత ఆర్.బి. చౌదరి కుమారుడిగా ప్రేక్షకులకు తెలుసు. ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. తండ్రి లెగసీని నిలబెట్టిన కుమారులుగా ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. ''జగన్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు... ఇద్దరు కుమార్తెలకు తండ్రి. భార్యను ప్రేమించే భర్త. ఫ్యామిలీకి ఎంతో వేల్యూ ఇస్తారు. నేను కూడా ఫ్యామిలీకి వేల్యూ ఇస్తా'' అని జీవా చెప్పారు.

Also Read: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!

ప్రచార చిత్రాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా జీవా నటనకు మంచి పేరు వచ్చింది. మరి, రేపు సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ విడుదల చేసిన పాటలు సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ఇటు చిత్రసీమ, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Also Readపెళ్లికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

టాప్ హెడ్ లైన్స్

Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Nindu Manasulu Serial Today July 17th: నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget