అన్వేషించండి

Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్‌‌లకు జైలుశిక్ష - చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరువునష్టం కేసులో కీలక తీర్పు!

పరువు నష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ తీర్పును వెల్లడించారు.

రువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయ స్థానం వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గతంలో  వారు చేసిన ఆరోపణలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది.

జీవిత, రాజశేఖర్ పై పరువు నష్టం కేసు ఎందుకు వేశారంటే?

జీవిత, రాజశేఖర్ దంపతులు 2011లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెగా స్టార్ గా తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి, ప్రజల కోసం బ్లడ్ బ్యాంకుతో పాటు ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి రక్తం అందివ్వాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. అప్పట్లో ఈ బ్లడ్ బ్యాంకుకు సినీ అభిమానులు మద్దతు తెలిపారు. ఎన్నో వేల మంది రక్త దానం చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్త సాయం చేయాలని ఆకాంక్షించారు. అయితే, జీవిత, రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ బ్లడ్ బ్యాంక్ పేరుతో సినీ అభిమానుల రక్తాన్ని సేకరించి, డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వాళ్లు ఏకంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో ఈ ఆరోపణలు సంచలనం కలిగించాయి. చిరంజీవి రక్త నిధికి చాలా మంది రక్తం ఇచ్చేందుకు వెనుకాడారు.

పరువు నష్టం దావా వేసిన అల్లు అరవింద్

జీవిత, రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద తీవ్ర ఆరోపణలు చేయడం పట్ల సినీ నిర్మాత, చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు జీవిత, రాజశేఖర్ దంపతుల వ్యాఖ్యలపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. వారిపై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి గొప్ప మనసుతో చేస్తున్న మంచి కార్యక్రమం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కేసు ఫైల్ చేశారు. 2011 నుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణ, తాజాగా ముగింపు దశకు వచ్చింది. మంగళవారం(జులై 18)నాడు ఈ కేసులో తుది తీర్పు వెల్లడి అయ్యింది. జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించడంతో అప్పీల్‌కు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు జీవిత, రాజశేఖర్ దంపతులకు న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది.

Read Also: అమెరికాలో అడుగు పెట్టిన ‘బాహుబలి’ బ్రదర్స్, శాన్ డియాగోలో ఇక రచ్చే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
Karthika Deepam 2 Serial Today August 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget