అన్వేషించండి

Mohanlal: చిక్కుల్లో మోహన్ లాల్ మూవీ - హైకోర్టు ఉత్తర్వులతో నిర్మాతలకు ఊరట

Jeethu Joseph: మలయాళ స్టార్ హీరో మోహన్ లాన్, ప్రియమణి కలిసి నటించిన సినిమా ‘నెరు’. ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. తాజాగా వీటిపై దర్శకుడు జీతూ సోసెఫ్ స్పందించారు.

Jeethu Joseph: మ‌ల‌యాళం స్టార్ హీరో మోహన్‌లాల్  ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ‘నెరు’. జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ (డిసెంబర్ 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా కథ విషయంలో కాపీ ఆరోపణలు ఎదురయ్యాయి.       

‘నెరు’ మూవీపై కాపీ ఆరోపణలు

ఈ సినిమాలోని కథ, తన కథ నుంచి కాపీ కొట్టారంటూ ఓ రచయిత కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ సినిమాను నిలిపివేయలేమని న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు జీతూ జోసెఫ్ కీలక వివరణ ఇచ్చారు.

దీపక్ ఉన్ని అనే రచయిత, ‘నెరు’ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్, రైటర్ శాంతి మాయాదేవి తన కథను దొంగిలించారని కేరళ హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటీషన్ లో రచయిత కీలక విషయాలు వెల్లడించారు. “జీతూ, శాంతితో కలిసి 2021లో ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చర్చించాను. 49 పేజీల స్క్రిప్ట్‌ తమకు ఇవ్వాలని వారు నన్ను కోరారు.  ఆ తర్వాత నన్ను కాదని వాళ్లే ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూశాక నా కథ కొట్టివేశారని అర్థం అయ్యింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయడంతో పాటు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను” అని తెలిపారు. దీపక్ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది.

కాపీ ఆరోపణలపై స్పందించిన దర్శకుడు జీతూ

తన చిత్రం ‘నెరు’పై వస్తున్న కాపీ ఆరోపణలపై దర్శకుడు జీతూ జోసెఫ్ స్పందించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. నిజాయితీతో తెరకెక్కించిన చిత్రంపై కాపీ ఆరోపణలు రావడం ఆవేదన కలిగిస్తుందన్నారు. “’నెరు’ చిత్రం ఇతర చిత్రాల మాదిరిగానే చాలా నిజాయితీతో తెరకెక్కించాను. సినిమా విడుదలకు ముందే వివాదం సృష్టించారు. నేను కథను కాపీ కొట్టానని ఆరోపించారు. కానీ, అదంతా అవాస్తవం. మీరు సినిమా చూసి ఏది నిజమో? ఏది అబద్దమో తెలుసుకోండి. అనవసర ఆరోపణలు చేసిన ‘నెరు’ చిత్రాన్ని అపకీర్తి పాలు చేయకండి” అని జీతూ వివరించాడు.   

‘నెరు’ మూవీ గురించి..

మోహన్‌ లాల్ ఈ చిత్రంలో విజయ్‌ మోహన్‌ అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు. చాలా రోజులుగా కేసులు వాదించ‌ని ఒక లాయ‌ర్ స‌డ‌న్‌ గా ఒక కేసు కోసం మ‌ళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రం కోర్టు రూం డ్రామా నేపథ్యంలో ముందుకు సాగుతుంది.

Read Also: ప్రభాస్‌ను షారుఖ్‌తో పోల్చిన ప్రశాంత్ నీల్ - 20 ఫ్లాప్స్ వచ్చినా స్టార్ సారే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసనీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Anasuya Bharadwaj : యాంకర్ అనసూయపై అశ్లీల కంటెంట్ - నిందితుడి అరెస్ట్
యాంకర్ అనసూయపై అశ్లీల కంటెంట్ - నిందితుడి అరెస్ట్
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Iran Warns US: ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Vijay Sethupathi: 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
Dhanush D56 Movie : ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
Embed widget