అన్వేషించండి

Prabhas : ప్రభాస్‌ను షారుఖ్‌తో పోల్చిన ప్రశాంత్ నీల్ - 20 ఫ్లాప్స్ వచ్చినా స్టార్ సారే!

Salaar : ‘సలార్’ విడుదలకు ముందుకు ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వరుస పరాజయాల గురించి మాట్లాడుతూ షారుఖ్ తో పోల్చారు.

Prashant Neel Compares Prabhas With Shah Rukh Khan: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సలార్’ మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు పాన్ ఇండియన్ యాక్టర్ ప్రభాస్ కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా కూడా ఆస్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ లాంటి పాన్ ఇండియన్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కాలి అనుకుంటున్నారు ప్రభాస్.

ప్రభాస్ ను షారుఖ్ తో పోల్చిన ప్రశాంత్ నీల్

అటు ‘సలార్’ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’ చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరచెక్కించడంతో సహజంగానే అభిమానులలో ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అయితే, ‘సలార్’ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ నటించిన ‘డుంకీ’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతోంది. ఒక్కరోజు తేడాతో ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ వరుస పరాజయాలపై స్పందించారు. పనిలో పనిగా షారుఖ్ తో ప్రభాస్ ను పోల్చారు.

ప్రభాస్ ఎప్పటికీ పెద్ద స్టారే- ప్రశాంత్ నీల్

ఒక స్టార్ ఎప్పటికీ స్టార్ గానే ఉంటాడని చెప్పారు. ఒక్క ఫ్లాప్ వచ్చినా 20 ఫ్లాప్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2018లో ‘జీరో’ పరాజయం తర్వాత షారుఖ్ సక్సెస్ లేక ఇబ్బంది పడినట్లు చెప్పారు. మళ్లీ ఈ ఏడాది ‘పఠాన్’తో అద్భుతంగా ఎంట్రీ ఇచ్చారని గుర్తు చేశారు. అదే సమయంలో పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించారని చెప్పారు. ఇదే విషయం ప్రభాస్ కు వర్తిస్తుందన్నారు. “ప్రభాస్ పెద్ద స్టార్. ‘బాహుబలి’ తర్వాత బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడు. ఆయనకు ఉన్న క్రేజ్ ను ప్రజలు మరిచిపోరు. స్టార్స్ ఎప్పుడూ స్టార్సే. వారు ఒక ఫ్లాప్ లేదంటే 20 ఫ్లాప్స్ కలిగి ఉండవచ్చు. ఒక్క హిట్ కొడితే మళ్లీ యథాస్థానానికి వచ్చేస్తారు. షారుఖ్ ఎప్పుడూ స్టార్ అనే విషయం ‘పఠాన్’తో రుజువు అయ్యింది” అని చెప్పుకొచ్చారు.  

ఒక్కరోజు తేడాతో ‘డుంకీ’, ‘సలార్’ విడుదల

ఇక షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబోలో తెరకెక్కిన ‘డుంకీ’ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాప్సీ పన్ను ఇందులో హీరోయిన్ గా నటించింది. అటు ప్రభాస్, శృతిహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ మూవీ రేపు(డిసెంబర్ 22న) విడుదల కానుంది. ఇందులో ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదలకాబోతోంది.

Read Also: నటి గౌతమి ఆస్తుల కేసులో నిందితులకు ఎదురుదెబ్బ - బెయిల్ నిరాకరించిన కోర్టు

టాప్ హెడ్ లైన్స్

Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget