అన్వేషించండి

Janaki Kalaganaledu October 27th: జెస్సి హెల్త్ గురించి జ్ఞానంబ దగ్గర నోరు జారిన డాక్టర్- మల్లిక కడుపు డ్రామా తెలుసుకున్న జానకి

జెస్సి కడుపులోని బిడ్డ ఎదుగుదల సక్రమంగా లేదని డాక్టర్ జానకి, రామాతో చెప్తుంది. అదే టైమ్ లో జెస్సి కళ్ళు తిరిగిపడిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జెస్సి కళలు తిరిగి పడిపోవడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ వచ్చి పరీక్షిస్తుంది. డాక్టర్ నుంచి తప్పించుకునేందుకు మల్లిక తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. బయటకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావ్ అని రామా అడుగుతాడు. చేసేది లేక మళ్ళీ మల్లిక ఇంట్లోకి వెళ్తుంది. ప్రెగ్నెంట్ గా ఉన్న తనకి అందాల్సిన ఫుడ్ అందలేదు, అయిన తన హెల్త్ కండిషన్ గురించి మొన్న చెప్పాను కదా ఇంత కేర్ లెస్ గా ఎలా ఉన్నారని డాక్టర్ కోప్పడుతుంది. ప్లీజ్ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అని డాక్టర్ కి జానకి సైగ చేస్తుంది. మల్లిక అదే మాట పట్టుకుని జెస్సి ఆరోగ్యం గురించి జానకికి చెప్పారా అని అడుగుతుంది. జెస్సి హాస్పిటల్ కి ఎప్పుడు వచ్చిందని అంటుంది.

సోరి నేను పొరపాటు బడ్డాను జెస్సి ఏజ్ లాంటి అమ్మాయిని చెక్ చేసి చెప్పాను అదే మూడ్ లో ఉండి జెస్సికి చెప్పాను అనుకున్నా అని కవర్ చేస్తుంది. దీంతో జానకి, రామా ఊపిరి పీల్చుకుంటారు. ఇదే సందు దొరికిందని మల్లిక చిన్నగా జారుకుంటుంది. మంచి ఫుడ్ తీసుకుని మెడిసిన్ వేసుకోమని డాక్టర్ జెస్సికి చెప్తుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా బయటకి వెళ్ళి కూర్చుంటుంది. జానకి మల్లిక కడుపుతో ఉందని చెక్ చెయ్యమని డాక్టర్ ని అడిగితే పిలవమని చెప్తుంది. మల్లిక కోసం చికిత, విష్ణు వెతుకుతూ ఉంటే వాళ్ళని చూసి మళ్ళీ  తప్పించుకునేందుకు చెట్టు దగ్గర పెద్ద స్టూల్ వేసుకుని ఎక్కి కూర్చుంటుంది. ఎంతకీ కనిపించకపోవడంతో సరే అని డాక్టర్ వెళ్ళిపోతుంది.

Also read: గృహలక్ష్మికి అగ్నిపరీక్ష- తులసిని నీచంగా అవమానించిన నందు, అనసూయ

గోవిందరాజులు అక్కడికి వచ్చి స్టూల్ ఇక్కడ పెట్టారు ఏంటి అనుకుని దాన్ని తీసుకెళ్లిపోతాడు. మల్లిక వెంటనే చెట్టు ఎక్కి కూర్చుంటుంది. అక్కడికి దగ్గర్లోనే జానకి చదువుకోవడానికి కూర్చుంటుంది. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్న మల్లిక ఎటు వైపు వెళ్లిపోయిందని ఆలోచిస్తూ ఉంటుంది. మల్లిక చెట్టు మీద నుంచి దిగడానికి భయపడుతూ ఉంటే జానకి చూస్తుంది. చెట్టు పైకి ఎక్కి ఏం చేస్తున్నావ్ కిందకి రా అని జానకి అంటుంది. ఎలా రాను చెట్టు ఎక్కిన తర్వాత నిచ్చెన తీసేశారు అనేసరికి జానకి తెచ్చి మళ్ళీ దాన్ని వేస్తుంది. దీంతో మల్లిక కిందకి దిగి వెళ్లిపోతుంటే జానకి పిలిచి ఆపుతుంది. చెట్టు పైకి ఎందుకు ఎక్కావ్ అని అడుగుతుంది. వేపాకులు కోసుకుందామని ఎక్కాను అని కవర్ చేస్తుంది. వేపరసం తాగాలని అనిపించిందని అంతే ఒకసారి ఇస్తే వద్దని అన్నావ్ కదా అని అనుమానంగా అడుగుతుంది.

అంతగా తాగలని అనిపింస్తే విష్ణుకి అఖిల్ కి చెప్పాలి కదా ప్రెగ్నెంట్ వి అలా ఎలా ఎక్కేస్తావ్ అని అడుగుతుంది. కడుపులో బిడ్డ పెరుగుతుంది చెక్ చేయించుకొకపోతే అంత నిర్లక్ష్యం ఎందుకని అడుగుతుంది. వేపాకులు కోసం చెట్టు ఎక్కావ్ నిచ్చెన తీసేస్తే ఎవరిని ఎందుకు పిలవలేదు అని పోలీసుల మాదిరిగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. వాటి నుంచి మల్లిక తప్పించుకుని వెళ్ళిపోతుంది. మల్లిక ప్రవర్తన తేడాగా ఉంది, ప్రెగ్నెంట్ గా బిహేవ్ చేయడం లేదు, డాక్టర్ వచ్చే టైమ్ కి వెళ్ళిపోయింది, అసలు మల్లిక ప్రెగ్నెంట్ ఏనా లేదా అలా అని చెప్పి డ్రామాలు ఆడుతుందా ఏది ఏమైనా విషయం తెలుసుకోవాలి అని జానకి అనుకుంటుంది.

Also Read: ఆదిత్యపై దేవుడమ్మ అనుమానం - మాధవ్ ఇంట్లో భాగ్యమ్మని చూసిన షాకైన సత్య

తరువాయి భాగంలో..

నీలావతికి జానకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంటికి వచ్చిన నీలావతి జానకిని పిలుస్తుంటే మల్లిక వచ్చి పొద్దున్నే వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది. జానకి ఫోన్ చేసి కోపంగా మాట్లాడింది నువ్వు ఆడుతున్న కడుపు నాటకం తెలిసిపోయిందా ఏంటి అని నీలావతి మల్లికని అడగటం జానకి చాటుగా వింటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget