Janaki Kalaganaledu January 4th: రామా మీద నోరుపారేసుకున్న మల్లిక- క్షమించలేనని తెగేసి చెప్పిన జ్ఞానంబ
జానకి ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అప్పు తీర్చడానికి రామా తన స్వీటు కొట్టు తాకట్టు పెట్టాలని అనుకుంటాడు. ఇదే విషయం జ్ఞానంబకి చెప్పడానికి వెళతారు. ఎందుకోసం చేసినా తన వల్ల తప్పు జరిగిందని, దాని ఫలితం ఇల్లు పోయే పరిస్థితి వచ్చింది. చేసిన అప్పు తిరిగి చెల్లించడానికి ఒకటే దారి కనిపిస్తుంది. స్వీటు కొట్టు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందామని అనుకుంటున్నట్టు చెప్తాడు. ఆ మాటకి మల్లిక అడ్డుపడుతుంది. తర్వాత షాపుని విడిపించడానికి ఇంటిని మళ్ళీ తాకట్టు పెడతారా అని మల్లిక నిలదీస్తుంది. జీవనాధారంగా ఉన్న షాపు తాకట్టు పెడతాను అంటే ఎలా కుదురుతుందని అంటుంది. విష్ణు కాసేపు సైలెంట్ గా ఉండమని అంటాడు. కానీ మల్లిక మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. జెస్సి కూడా మల్లికకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అఖిల్ నోరు మూయిస్తాడు.
ఇల్లు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇంతకమించి వేరే దారి లేదు కదా అని జానకి అంటుంది. పరువు పోకూడదు అంటే ఇప్పుడు ఈ గండం గట్టెక్కాలి కదా అంటుంది కానీ మల్లిక మాత్రం ఒప్పుకోదు. ఆ డబ్బు ఎందుకు తీసుకున్నారో దేవుడికే తెలియాలి అని నిష్టూరంగా మాట్లాడుతుంది. అమ్మ గౌరవం నిలబడాలి అంటే ఇల్లు మనకే ఉండాలి పరిస్థితి అర్థం చేసుకుని కొట్టు తాకట్టు పెట్టడానికి అందరూ ఒప్పుకోమని రామా బతిమలాడతాడు. మళ్ళీ ఇంటి కాగితాలు పెట్టకుండా ఏదో ఒకరకంగా అప్పు తీరుస్తాను అని అంటాడు. అయిన మల్లిక మాత్రం ఊరుకోదు దీంతో రామా బతిమలాడబోతుంటే మళ్ళీ ఇంకొక తప్పు చేయవద్దని షాపు కాగితాలు పెట్టేసి వెళ్ళమని చెప్తుంది.
Also Read: లాస్య బండారం బయటపెట్టిన శ్రుతి, అంకిత- ఉగ్రరూపం దాల్చిన నందు
మల్లిక మాటలకి రామా బాధపడుతూ ఉంటాడు. ఏనాడూ నా స్వార్థం చూసుకోలేదు, నాకంటూ ఎటువంటి ఆస్తి కూడబెట్టుకోలేదు. మరి జరిగిన దానికి తోడుగా ఉండకపోగా ఎందుకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రామా బాధపడుతుంటే జానకి వచ్చి నచ్చజెపుతుంది. కుటుంబం అంటే సంతోషమే కాదు ఇలాంటివి కూడా వస్తాయి అన్ని ఓర్చుకోవాలి అని చెప్తుంది. అందరూ చేసిన తప్పు గురించే ఆలోచిస్తున్నారు కానీ దాని వెనుక ఉన్న నిర్ణయం చూడటం లేదు, అమ్మ కూడా పరిస్థితి అర్తం చేసుకోవడం లేదని అంటాడు. ఎలాగైనా సరే ఇంటిని కాపాడుకోవాలని రామా డబ్బు తెచ్చే ప్రయత్నాలకి వెళతాడు.
విష్ణు ఇంటి పరిస్థితి గురించి ఆలోచించి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగుతాడు. అది విని మల్లిక ఫైర్ అవుతుంది. ఈ టైమ్ లో తోడుగా ఉండటం నా బాధ్యత. టెన్షన్ లో నాన్నకి పక్షవాతం వచ్చింది. నేను కూడా ఏదో ఒక సాయం చేయాలి ఇల్లు కాపాడుకోవాలి కదా అని అంటాడు. ఆ మాటకి మల్లిక అసలు ఒప్పుకోదు. రూ.20 లక్షలు అప్పు చేసి వాళ్ళు ఏదో స్థలం కొనుక్కున్నారు అది మీకు అర్థం కావడం లేదని తిడుతుంది. అటు జెస్సి కూడా రామా చేసిన అప్పు అఖిల్ ఉద్యోగం కోసమే అని నమ్ముతుంది. వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని వెనకేసుకొస్తుంది. కానీ అఖిల్ మాత్రం రామాని తప్పుపడతాడు. ఇదంతా వదిన ప్లాన్ అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. జెస్సి తన తండ్రిని డబ్బు అడుగుతానని అంటుంది కానీ అందుకు అఖిల్ ఒప్పుకోడు.
Also Read: వేద మనసు ముక్కలు చేసిన యష్- షాకైన రాజా, రాణి
రామా తనకి తెలిసిన వాళ్ళ దగ్గరకి వెళ్ళి డబ్బులు అప్పుగా కావాలని అడుగుతూ ఉంటాడు. ఒక పెద్దాయన దగ్గరకి వెళ్ళి రూ. 25 లక్షలు సర్దమని అడుగుతాడు. డబ్బులు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఐదారు రోజులు సమయం కావాలని అంటాడు. కానీ రామా మాత్రం వెంటనే కావాలని అనేసరికి కుదరదని చెప్తాడు. గోవిందరాజుల్ని డాక్టర్ వచ్చి పరీక్షిస్తాడు. గతంలో ఇచ్చిన మందులు వాడుతూ ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు.