అన్వేషించండి

Janaki Kalaganaledu December 21st: అన్నయ్య సాయం వద్దన్న అఖిల్- రామా అమాయకత్వాన్ని చరణ్ అవకాశంగా తీసుకుంటాడా?

జానకి ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రామా సంతోషంగా ఇంటికి వస్తాడు. అఖిల్ కి ఒక విధంగా ఉద్యోగం వచ్చినట్టే, దారిలో తన చిన్న నాటి స్నేహితుడు కలిశాడని చెప్తాడు. అఖిల్ కి ఉద్యోగం ఇస్తానని చెప్పినట్టు చెప్పి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. ఈ కార్డు అఖిల్ కి ఇచ్చి వివరంగా చెప్పమని రామా అంటే జానకి వద్దని ఆపుతుంది. ఇప్పుడు అఖిల్ కి ఉద్యోగం గురించి చెప్తే ఖాళీగా ఉన్నా కాబట్టి చిన్నచూపుతో చెప్తున్నా అనుకుంటారని జానకి సర్ది చెప్తుంది. దీంతో సరే అని రామానే మాట్లాడటానికి వెళ్తాడు. అఖిల్ గదిలోకి వచ్చి ఫ్రస్టేట్ అవుతాడు. జెస్సి వెనుకాలే వచ్చి మల్లిక అక్క ఏదో సలహా చెప్తుంటే ఎందుకు వద్దని వచ్చావ్ అని అంటుంది. అఖిల్ కోపంగా తన మీద అరుస్తాడు.

రామా అఖిల్ ని పిలుస్తాడు. విజిటింగ్ కార్డ్ అఖిల్ కి ఇచ్చి చూడామని చెప్తాడు. అది తన స్నేహితుడిది అని ఉద్యోగం ఇస్తానన్నాడని చెప్తాడు. కానీ అఖిల్ మాత్రం రికమండేషన్ మీద జాబ్ వద్దని చెప్తాడు.

అఖిల్: రేపు వదిన నా భర్త వల్లే జాబ్ వచ్చిందని అందరి ముందు చెప్తూ ఉంటే భరించలేను

రామా: నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్ మీ వదిన గురించి తప్పుడ అర్థం చేసుకుంటున్నావ్

అఖిల్: వద్దు అన్నయ్య నాకు నేనుగానే ఉద్యోగం చూసుకుంటాను

Also Read: తులసి విలువ తెలుసుకుంటున్న నందు- బతికి అందరినీ బాధపెట్టడం ఎందుకంటున్న పరంధామయ్య

జెస్సి: అక్క నీ మంచి కోసం కదా చెప్తుంది ఆలోచించొచ్చు కదా

అఖిల్: అవును ఎంత బాగా అంటే ఆవేశంలో అరెస్ట్ చేయిస్తుంది, అందరూ తప్పు చేశాను అని చూస్తున్నారు. అది కూడా ఉద్యోగం రాకపోవడానికి ఒక కారణం అని అంటాడు. ఉద్యోగం తనని తానుగానే చూసుకుంటా అని సహాయం వద్దని చెప్తాడు. జానకి గదిలో కూర్చుని చదువుకోవడం చూసి రామా చాలా సంతోషిస్తాడు. అఖిల్ కి ఉద్యోగం గురించి చెప్పారా అని జానకి అడుగుతుంది. ఎవరి వల్లో వచ్చిన ఉద్యోగం వద్దని అఖిల్ అన్నాడని రామా చెప్తాడు. ఆ మాటకి జానకి చాలా బాధపడుతుంది.  ‘నా ఆశయం కోసం మనం దూరంగా ఉంటున్నాం, ఐపీఎస్ అయిన తర్వాత పరిపూర్ణమైన ఇల్లాలిగా ఉంటాను. ఈ విషయంలో మీరు బాధపడి ఉంటే క్షమించండి’ అని జానకి మనసులో అనుకుంటుంది.  

అఖిల్ మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తుంటే రామా తన స్నేహితుడి ఆఫీసు దగ్గర దింపుతాడు. అవసరమా అయితే అక్కడ తన పేరు చెప్పమని రామా అంటాడు. కానీ అఖిల్ మాత్రం రికమండేషన్ మీద జాబ్ వద్దని అంటాడు. అవసరమా అయితే అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత చరణ్ తో మాట్లాడాలని రామా అనుకుంటాడు. ఇంటర్వ్యూకి చరణ్ దగ్గరకి వెళతాడు అఖిల్.

Also Read: బాపు బొమ్మలా వేద, కన్నార్పకుండా చూస్తున్న యష్- మాలిని మీద కస్సుబుస్సులాడిన సులోచన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anil Kapoor: స్లమ్‌డాగ్‌ కాదు... మిలియనీరే - ఫ్రీగా చేసిన సినిమాకు ఇప్పటికీ డబ్బులు వస్తున్నాయ్
స్లమ్‌డాగ్‌ కాదు... మిలియనీరే - ఫ్రీగా చేసిన సినిమాకు ఇప్పటికీ డబ్బులు వస్తున్నాయ్
Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 15) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 15) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Madhuram Song Lyrics: కార్తీక్ మెలోడీ పాడితే మధురమే... మెగా కోడలు లావణ్య 'సతీ లీలావతి'లో లవ్ సాంగ్ లిరిక్స్ - వనమాలి ఏం రాశారంటే?
కార్తీక్ మెలోడీ పాడితే మధురమే... మెగా కోడలు లావణ్య 'సతీ లీలావతి'లో లవ్ సాంగ్ లిరిక్స్ - వనమాలి ఏం రాశారంటే?
Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Embed widget