By: ABP Desam | Updated at : 23 Dec 2022 01:04 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Movie VFX/You Tube
‘అవతార్ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా దర్శకుడు జేమ్స్ కేమరూన్ క్రియేట్ చేసిన విజువల్ వండర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే 2009లో వచ్చిన ‘అవతార్’ సినిమాకు సీక్వెల్ గా ’అవతార్ 2’ సినిమాను రూపొందించారు. ‘అవతార్’ సినిమా వచ్చిన దాదాపు 13 ఏళ్ల తర్వాత సీక్వెల్ సినిమా వచ్చింది. ఇలా ఇన్నేళ్లు పట్టడానికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా. అయితే దానికి కారణం తెలియాలి అంటే ‘అవతార్ 2’ సినిమా మేకింగ్ వీడియోను చూడాల్సిందే. ఇటీవల సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇంత కష్టం ఉంది కాబట్టే ‘అవతార్’ సినిమాకు సీక్వెల్ రావడానికి అన్ని సంవత్సరాలు పట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ మొత్తాన్ని గ్రీన్ మ్యాట్స్ మీదే చిత్రీకరించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. నటీనటుల ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ను క్యాప్చర్ చేసి.. వీఎఫ్ఎక్స్‌లో పాత్రలను మలిచారు. పైగా, ఈ మూవీలో 80 శాతం సీన్స్ అన్నీ నీటిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో కామెరూన్ ఆయన టీమ్ ఎంత శ్రమించాల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నిడివి మరీ ఎక్కువగా ఉన్నా.. వారి కష్టాన్ని చూస్తే అది పెద్ద లోపం కాదనిపిస్తుంది.
‘అవతార్ 2’ సినిమాతోపాటే ‘అవతార్ 3’ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు డైరెక్టర్ కామెరూన్. ఎందుకంటే ఇందులో ఉండే చాలా పాత్రలు తర్వాత సీక్వెల్ లో కూడా కనిపించే అవకాశం ఉంది. అందుకే వారి వయస్సును దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణను పూర్తి చేశారు. ఇప్పటికే పార్ట్ 3 కోసం పనులు ప్రారంభించారట కామెరూన్ టీమ్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘అవతార్ 3’ రఫ్ కట్ నిడివి తొమ్మిది గంటలకు పైగానే వచ్చిందట. ఆ ఫుటేజ్ ను కామెరూన్ 20th సెంచురీ స్టూడియోస్ కు అందజేశారట. అంతేకాదు ఆ తొమ్మిది గంటల ఫుటేజ్ కు విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటికే ‘అవతార్ 3’ సినిమా 2024లో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ‘అవతార్ 3’ గ్రాఫిక్స్ వర్క్ పై కామెరూన్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
Also Read: ధమాకా రివ్యూ - 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?
జేమ్స్ కామెరూన్ కు వచ్చిన ఓ కల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారాయన. అవతార్ మొదటి భాగంలో పండోరా గ్రహంపై దాడి చేసిన కల్నల్ టీంను అక్కడి గ్రహం వాళ్లు తరిమి కొడతారు. దీంతో మొదటి భాగం ముగుస్తుంది. అయితే కల్నల్ మళ్లీ ఆ గ్రహానికి తన సైన్యంతో వచ్చి.. వారిపై ఎలా దాడి చేస్తాడు. ఎలా ఆ గ్రహాన్ని నాశనం చేస్తాడనేదే రెండో భాగం. అయితే ఈ దాడి నుంచి హీరో అతని కుటుంబం అక్కడ నుంచి తప్పించు కొని ఓ సముద్ర తెగ జలవాసులు ఉండే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వారి సాయంతో భూలోకవాసుల్ని ఎదురించి ఎలా ఓడిస్తారు అనేది చూపిస్తారు. అయితే ఇదంతా సముద్రం అడుగున జరుగుతుంది. ప్రస్తుతం అవతార్ 2ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దీని తర్వాత మూడో భాగం ‘అవతార్: ది సీడ్ బేరర్’ 2024లో వస్తుంది. నాలుగో భాగం ‘అవతార్: ది టల్కున్ రైడర్’ 2026 లో రానుంది. ఐదో భాగం ‘అవతార్: ది క్వెస్ట్ ఫర్ ఏవ’ 2028 లో విడుదల చేస్తామని జేమ్స్ కామెరూన్ ఇప్పటికే ప్రకటించారు.
Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి
RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
Guppedanta Manasu January 31st Update: ప్రేమే సమస్య అన్న రిషి, ప్రేమను ప్రేమ గెలిపించుకుంటుందన్న వసు - దేవయానికి షాకుల మీద షాకులు
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Ennenno Janmalabandham January 31st: మాళవిక చెంప పగలగొట్టిన వేద- భ్రమరాంబిక ముందు నిజం బట్టబయలు
MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
Warner as Pathaan: 'పఠాన్' గా అదరగొట్టిన డేవిడ్ వార్నర్- ఆస్కార్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్
ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్ ఉన్న ట్రక్ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు