By: ABP Desam | Updated at : 12 Sep 2023 04:15 PM (IST)
‘జానే జాన్‘ వెబ్ సిరీస్(Photo Credit: NetflixIndia/Instagram)
కరీనా కపూర్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. దశాబ్దానికి పైగా హిందీ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. ఆమె నటించిన ఎన్నో చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. వసూళ్లు సునామీ సృష్టించాయి. సైఫ్ అలీ ఖాన్ తో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత నెమ్మదిగా సినిమాలు చేయడం తగ్గించింది. సంసార జీవితంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. రోజు రోజుకు ఓటీటీల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆమె కూడా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే తొలి సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'జానే జాన్' పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సిరీస్ కు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ లో, విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలను పోషించారు. ఒంటరి జీవితాన్ని గడిపే ఒక స్త్రీ, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక టీచర్ చుట్టూ ఈ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. మాయ డిసౌజా అనే మహిళ, కొన్ని కారణాలతో భర్తను చంపేస్తుంది. ఆ హత్య గురించి బయటకు తెలియకుండా దాచిపెట్టడానికి ఆమె చాలా ప్రయత్నిస్తుంది. ఇంతకీ ఆమె ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? లేదా? అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సిరీస్ రూపొందుతోంది.
తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. కరీనా మాయా డిసౌజా పాత్రలో కనిపించగా, జైదీప్ పోలీసు అధికారిగా, విజయ్ వర్మ కరీనా నైబర్ గా నటిస్తున్నారు. ఇందులో తన కూతురుని కాపాడుకునేందుకు కరీనా పడే తపనను అద్భుతంగా చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకుడు సుజోయ్ ఘోష్ విడుదల తేదీని వెల్లడించారు. “కరీనా కపూర్ తో కలిసి పనిచేయడం ఎంత గౌరవంగా భావిస్తున్నాను. ఆమె మాయ డిసౌజాగా కనిపించబోతోంది. ‘జానే జాన్’ సిరీస్‌ను సెప్టెంబర్ 21న నెట్ ఫ్లిక్స్ ఇండియాలో తప్పకుండా చూడండి” అని రాసుకొచ్చారు.
whatta honor it was to work with kareena kapoor khan -- another level of dedication...
here she is as maya d'souza in...#JaaneJaan
21 sept on @NetflixIndia dekhna zaroor 😀 pic.twitter.com/evZhN57pVY— sujoy ghosh (@sujoy_g) September 12, 2023
సెప్టెంబర్ 21న కరీనా కపూర్ తన 43వ పుట్టిన రోజును జరుపుకోబోతోంది. అదే రోజు ఈ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ జపనీస్ రచయిత కీగో హిగాషినో 2005లో రాసిన నవల ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ ఆధారంగా రూపొందించబడింది. జానీ జాన్ క్రాస్ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్ తో కలిసి 12వ స్ట్రీట్ ఎంటర్‌టైమెంట్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించబడింది. కరీనా చివరిగా ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేదు.
Read Also: సంగీత దిగ్గజానికి తమిళ స్టార్ హీరో సపోర్టు- వారిదే తప్పన్న యువన్ శంకర్ రాజా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>