అన్వేషించండి

Ira Khan: మా నాన్న ఏడుస్తున్నట్లు నటిస్తున్నాడు, అమీర్ ఖాన్ పై కూతురు ఐరా కామెంట్స్

Ira Khan: రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్. ఈ పెళ్లిలో తన తండ్రి కంటతడి పెట్టడంపై ఆమె ఫన్నీగా స్పందించింది.

Ira Khan funny Comments About Aamir Khan: అమీర్ ఖాన్, ఆయన మొదటి భార్య కూతురు ఐరా ఖాన్ రీసెంట్ గా మూడు ముళ్ల బంధంతో సంసార జీవితాన్ని మొదలు పెట్టింది. తన బాయ్ ఫ్రెండ్, ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను వివాహం చేసుకుంది. తొలుత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట, ఆ తర్వాత రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో బంధుమిత్రుల నడుమ అట్టహాసంగా మరోసారి పెళ్లి చేసుకున్నారు. అనంతరం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అమీర్‌ఖాన్‌, తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్‌ రావుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్-నీతా అంబానీ దంపతులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తండ్రి కన్నీళ్లపై ఫన్నీగా స్పందించిన ఐరా ఖాన్

ఇక కుమార్తె పెళ్లి సందర్భంగా అమీర్‌ ఖాన్‌ భావోద్వేగానికి గురయ్యారు. కొత్త పెళ్లి జంట ఉంగరాలు మార్చుకుంటున్న సమయంలో కంటతడి పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పుట్టినింటి నుంచి మెట్టింటికి వెళ్తుందని ఉద్వేగానికి గురయ్యారు. ఆయన కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తాజాగా ఈ వీడియోపై ఐరా ఖాన్ రియాక్ట్ అయ్యింది. తన తండ్రి కన్నీళ్లపై ఫన్నీగా స్పందించింది. తన డాడి ఏడుస్తున్నట్లు బాగా నటిస్తున్నారని కామెంట్ చేసింది. మైక్ దగ్గరగా ఉన్నప్పుడు గట్టిగా ఏడుస్తున్నాడని, మైక్ దూరంగా వెళ్లగానే సైలెంట్ అవుతున్నాడని చెప్పుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఈ కామెంట్స్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. అంతేకాదు, పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర ఫోటోలను ఐరా షేర్ చేసింది.      

2021లో లవ్ ప్రపోజల్

పెళ్లికి ముందు ఐరా-నుపుర్ కాలకాలం ప్రేమాయణం కొనసాగించారు. 2021 సెప్టెంబర్‌లో ఓ మారథాన్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఇటలీ వెళ్ళినప్పుడు ఐరాకు ప్రపోజ్ చేశాడు నుపూర్. ఆ ప్రపోజల్‌ను వెంటనే యాక్సెప్ట్ చేయడంతో పాటు పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐరా. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే ఐరా, బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసేది. ఇక నుపుర్ శిఖరే మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, సెలబ్రెటీ ఫిట్ నెస్ ట్రైనర్. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌కి ఫిట్ నెస్ ట్రైనర్ కూడా ఇతనే. నుపూర్ టెన్నిస్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా పొందాడు. ఇండస్ట్రీపై ఆసక్తితో 2004 లో పూణే నుంచి ముంబై వచ్చాడు. నుపుర్‌ను 2008లో సుస్మితా సేన్ వ్యక్తిగత శిక్షకుడిగా నియమించుకోవడంతో అతని జీవితం కీలక మలుపు తిరిగింది. తర్వాత అతను అమీర్ ఖాన్, కిరణ్ రావుతో సహా పలు ప్రముఖ వ్యక్తులకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేశాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

Read Also: సెట్లో ఉన్నంత సేపు నాకు అదే ధ్యాస, అసలు విషయం చెప్పేసిన శ్రీలీల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today April 6th: కౌషికి, సురేష్ విడిపోవడానికి కారణమేంటి..? జగధాత్రి నిషిక చెంప ఎందుకు పగులగొట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కౌషికి, సురేష్ విడిపోవడానికి కారణమేంటి..? జగధాత్రి నిషిక చెంప ఎందుకు పగులగొట్టింది..?
JD Chakravarthy : కమల్ హాసన్ కాలిగోటికి సరిపోను - కానీ ఈ రోల్ నా అదృష్టం... గాయపడ్డ సింహంపై జేడీ చక్రవర్తి రియాక్షన్
కమల్ హాసన్ కాలిగోటికి సరిపోను - కానీ ఈ రోల్ నా అదృష్టం... గాయపడ్డ సింహంపై జేడీ చక్రవర్తి రియాక్షన్
Biker Collection : బాక్సాఫీస్ సూపర్ రేసర్ బైకర్ - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ సూపర్ రేసర్ బైకర్ - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Somu Veerraju: కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
FASTag Rule: హైవే ప్రయాణికులకు అలర్ట్ - ఏప్రిల్ 10 నుంచి మారనున్న టోల్ నిబంధనలు!
హైవే ప్రయాణికులకు అలర్ట్ - ఏప్రిల్ 10 నుంచి మారనున్న టోల్ నిబంధనలు!
Embed widget