News
News
X

Mahesh Babu: మహిళలకు స్పెషల్ ట్వీట్‌తో విషెస్ చెప్పిన మహేష్ బాబు

నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ స్సెషల్ ట్వీట్ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

FOLLOW US: 
Share:

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమ హక్కుకులను కాపాడుకోవడానికి, వారు సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి సమాజంలో ‘ఆమె’ పాత్ర, కృషిను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ స్సెషల్ ట్వీట్‌తో మహిళలకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

మీ విజయాలను ప్రపంచం జరుపుకుంటుంది : మహేష్

మహిళల పట్ల ఎంతో గౌరవంగా నడుచుకుంటారు మహేష్. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన ఇలా రాసుకొచ్చారు. ‘‘మీ శక్తి సామర్ధ్యాలు, మొక్కవోని దీక్ష, నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతాయి. మీ విజయాలను ఈ ప్రపంచం సంబరంలా జరుపుకుంటుంది. నా సతీమణికి అలాగే ప్రపంచంలో ప్రతి మహిళకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారాయన. ప్రస్తుతం ఆయన ఉమెన్స్ డే సందర్భంగా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసి ఎంబీ ఫ్యాన్స్ కూడా మహిళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేస్తున్నారు. 

మహేష్ కు తోడుగా నమ్రత..

మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ ఇద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2005 ఫిబ్రవరి 10న వీరి వివాహం కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య సింపుల్ గా జరిగింది. వీరికి గౌతమ్, సితార సంతానం ఉన్నారు. మహేష్ జీవితంలో నమ్రత కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ఆయన అర్థాంగిగానే కాకుండా ఆయనకు అన్ని విషయాల్లో అంతరంగిక సలహాదారుగా కూడా ఆమె ఉంటారు. అటు భార్య, తల్లిగా కుటుంబ బాధ్యతలు మోస్తూనే ఇటు మహేష్ కు సంబంధించిన వ్యాపారాలను ఒంటిచేత్తో నిర్వహిస్తుంటారు నమ్రత. గత 18 ఏళ్లుగా వీరి దాంపత్యం ఆదర్శంగా కొనసాగుతుంది. ఇకముందు కూడా ఇలాగే మరింత ఆనందంగా కొనసాగాలని కోరుకుందాం. 
 
ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా..

మహేష్ బాబు వరుస సినిమా షూటింగ్ లతో బిజీ గా గడుపుతున్నారు. ఆయన ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లు గా చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలసి పనిచేస్తున్నారు. గతంలో వీరి కాంబో లో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

Published at : 08 Mar 2023 01:13 PM (IST) Tags: Mahesh Babu mahesh babu movies International Women's Day Women's Day 2023

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌