Indians in American movies: అమెరికాకు వెళ్లినా సినిమా ధియేటర్లలో అదే గోల - దక్షిణ భారతీయుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు
American movie theaters: అమెరికాలో దక్షిణాది సినిమా హీరోల సినిమాలు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి. అయితే రిలీజ్ అయినప్పుడు హీరో ఫ్యాన్స్ చేసే అల్లరి శృతి మించుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

Indian audiences in American movie theaters: అమెరికా ధియేటర్లలో దక్షిణాది సినీ ప్రేక్షకులు చేస్తున్నగోల శృతి మించుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో అభిమాన హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఫ్యాన్స్ రచ్చచేస్తారు. సినిమాను చూడనివ్వరు. గోల గోల చేస్తారు. కాయితాలు చింపి విసిరేస్తారు. ఇప్పుడు అమెరికా ధియేటర్లలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. దీంతో అక్కడ సినిమాలకు వెళ్లే వారు సోషల్ మీడియాలో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టెక్సాస్‌లో ఒక థియేటర్‌లో దక్షిణ భారతీయుల ప్రవర్తనపై ఒక భారతీయ మహిళ తీవ్ర విమర్శలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, ఒక భారత సంతతి మహిళ థియేటర్‌లో దక్షిణ భారతీయ ప్రేక్షకులు అసభ్యకరంగా ప్రవర్తించారని, సినిమా సమయంలో విపరీతంగా ప్రవర్తిస్తూ ఇతరుల ఆనందానికి భంగం కలిగించారని విమర్శించారు.
🚨 Dallas, Texas 🇺🇸
— KumarXclusive (@KumarXclusive) August 30, 2025
A follower sent this Telugu video:
Group of young Indians (mostly F-1 & H-1Bs) shouting in front of a movie 🎬 theater – “Dallas belongs to India 🇮🇳”
Earlier I was mistaken, but an Indian lady clarified this clearly in Telugu.
📹 Link:… pic.twitter.com/Rb7cdCvqPU
ఆ విమర్శలు చెప్పిన మహిళ పేరు స్వాతి..ఆమె అభిప్రాయంతో పలువురు ఏకీభవిస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజు థియేటర్‌కి వెళ్లాలి అంటే భయం వేస్తుంది, ఎలాంటి వీడియోలోనో, ఏ పోలీస్ లెక్చర్‌కి బుక్ అవుతామో తెలియడంలేదని అంటున్నారు. ఇండియాలో కూడా ఇలా చేయడం లేదని.. హైద్రాబాద్ లాంటి మెట్రోస్‌లో అస్సలు ఈ చిల్లర చేష్టలులేవని అంటున్నారు. మరి అమెరికాలో ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారని కొంతమంది ప్రశఅనిస్తున్నారు.
ఇలా ధియేటర్లలో రచ్చ చేస్తున్న వారు ఎవరో వీళ్ళ చదువు లేంటో, ఉద్యోగాలు ఎక్కడో గాని, తెలుగు diaspora పరువు తీయాలని కంకణం కట్టుకున్నారని కొంత మంది ఆవేదన వ్యక్తంచేస్తున్నరాు. ఈ వీడియో లో కొందరు, బయట చాలా మంది ఉన్నారని చివరికి ఇది అందరి మెడకి చుట్టుకుంటుంది. ఇది కేవలం డాలస్ ప్రాబ్లెమ్ కాదు జనాలకి చిరాకు తెప్పిస్తే, వేరే రాష్ట్రాలకు పాకడం నిమిషంలో పని అని హెచ్చరిస్తున్నారు.
నిజంగా చదువుకుని.. మంచి ఉద్యోగంలో స్థిరపడిన వారు తమకు హీరోల మీద అభిమానం ఉంటే..భారీగా ఖర్చు పెట్టుకుని ప్రీమియర్ షోలుచూస్తారేమో కానీ..ఇలా ధియేటర్లలో రచ్చచేసి అందరినీ భయాందోళనలకు గురిచేయరని అంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్టకపడకపోతే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. దక్షిణాది హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అందుకే విద్యార్థులు.. ఇతర వీసాల మీద వెళ్లిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సలహాలిస్తున్నారు.





















