News
News
X

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.

FOLLOW US: 
Share:

Ileana D'Cruz Hospitalised: టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో స్టార్ల సరసన నటించిన ఇలియానా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఇలియానా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. ఆసుపత్రి నుంచి కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇది అభిమానులను చాలా కలవరపెట్టింది.

ఇలియానా షేర్ చేసిన ఒక ఫోటోలో తన చేతిలో డ్రిప్ ఉంది. దానికి క్యాప్షన్‌గా ఇలియానా 'ఒక రోజులో చాలా మారవచ్చు. కొంతమంది లవ్లీ డాక్టర్లు, మూడు బ్యాగుల IV ఫ్లూయిడ్స్!’ అని పెట్టింది. ఒకే స్టోరీలో రెండు ఫొటోలను ఇలియానా షేర్ చేసింది.

హెల్త్ అప్డేట్ కూడా...
మరో ఫోటోను షేర్, ఇలియానా తన హెల్త్ అప్డేట్‌ను కూడా అందించింది. అందులో ఇలియానా'నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలా మంది నాకు మెసేజ్‌లు పంపుతున్నారు. వారందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ ప్రేమను పొందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇప్పుడు పూర్తిగా బాగున్నాను అని మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు సకాలంలో సరైన, మెరుగైన వైద్య సంరక్షణ లభించింది.’ అని క్యాప్షన్ తరహాలో రాసింది.

ఇలియానా దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాల్లో నటించింది. 19 ఏళ్ల వయసులో మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఇలియానా నటించిన తొలి చిత్రం ‘దేవ దాసు’. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి గానూ ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా ఇలియానా అందుకుంది. ఇలియానా బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం 'బర్ఫీ'. ఇందులో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్‌ హీరో.

ఇలియానా చివరిసారిగా 'బిగ్ బుల్' చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా సక్సెస్. ఈ నటి త్వరలో 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' చిత్రంలో కూడా కనిపించనుంది. ఇలియానా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇలియానా ఇటీవలే కొన్ని మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. ఇది మాత్రమే కాకుండా కత్రినా కైఫ్ సోదరుడితో ఆమె ప్రేమలో ఉంది కూడా గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎవరూ స్పందించలేదు.

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ చేస్తుందని సమాచారం. ఇటీవల కత్రినా బర్త్ డే వేడుకలు మాల్దీవ్స్ లో జరగ్గా అందులో ఇలియానా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇందులో సెబాస్టియన్ కూడా ఉండడంతో అందరూ ఈ డేటింగ్ వార్తలు నిజమేనని భావించారు. 

తాజాగా ఈ విషయాన్ని దర్శకనిర్మాత కరణ్ జోహార్ కన్ఫర్మ్ చేశారు. ఆయన హోస్ట్ చేస్తోన్న 'కాఫీ విత్ కరణ్' షో లేటెస్ట్ ఎపిసోడ్ కి కత్రికా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా కత్రినాను కొన్ని ప్రశ్నలు అడిగారు కరణ్ జోహార్. ఎప్పటిలానే ఫస్ట్ నైట్, సెక్స్ అంటూ కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడారు కరణ్ జోహార్. ఇదే సమయంలో కత్రినా తమ్ముడు సెబాస్టియన్ లవ్ లైఫ్ ను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు కరణ్. 

కన్ఫర్మ్ చేయట్లేదు అంటూనే మాల్దీవ్స్ ట్రిప్ కి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకొచ్చినప్పుడు.. మైండ్ లో కాలిక్యులేషన్ చేసుకున్నానని.. వీరిద్దరూ(ఇలియానా, సెబాస్టియన్) నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక పార్టీలో కలుసుకున్నారని.. అప్పుడే ఇంత ఫాస్ట్ గా స్టోరీ నడిచిందా..? అనుకున్నట్లు కరణ్ తెలిపారు. ఈ కామెంట్స్ కి నవ్వేసిన కత్రినా.. కరణ్ జోహార్ పార్టీలో అందరిని గమనిస్తుంటారని చెప్పింది.

Published at : 30 Jan 2023 06:32 PM (IST) Tags: Ileana D'Cruz Ileana Ileana Health Update

సంబంధిత కథనాలు

‘గేమ్ చేంజర్’గా రామ్ చరణ్, టైటిల్‌తో హీట్ పెంచేసిన శంకర్

‘గేమ్ చేంజర్’గా రామ్ చరణ్, టైటిల్‌తో హీట్ పెంచేసిన శంకర్

ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ స్పెషల్ సర్‌ప్రైజ్ - థ్యాంక్స్ చెప్పిన తారక్

ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ స్పెషల్ సర్‌ప్రైజ్ - థ్యాంక్స్ చెప్పిన తారక్

Manoj wishes Ram Charan: గ్లోబల్ స్టార్ కు సూపర్ డూపర్ విషెస్, చెర్రీకి మంచు మనోజ్ బర్త్ డే శుభాకాంక్షలు!

Manoj wishes Ram Charan: గ్లోబల్ స్టార్ కు సూపర్ డూపర్ విషెస్, చెర్రీకి మంచు మనోజ్ బర్త్ డే శుభాకాంక్షలు!

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ లెక్కలు బయటపెట్టిన కార్తికేయ, మొత్తం ఖర్చుపై క్లారిటీ

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ లెక్కలు బయటపెట్టిన కార్తికేయ, మొత్తం ఖర్చుపై క్లారిటీ

హిందీలో చరణ్‌ను తక్కువ చేసి మాట్లాడారు, ఇప్పుడు ప్రపంచమంతా తనవైపు చూస్తోంది: నాగబాబు

హిందీలో చరణ్‌ను తక్కువ చేసి మాట్లాడారు, ఇప్పుడు ప్రపంచమంతా తనవైపు చూస్తోంది: నాగబాబు

టాప్ స్టోరీస్

కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!

కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?

నెల్లూరు నుంచి ఇంకెవరు వస్తారు? లోకేష్‌తో గిరిధర్ రెడ్డి భేటీ

నెల్లూరు నుంచి ఇంకెవరు వస్తారు? లోకేష్‌తో గిరిధర్ రెడ్డి భేటీ