అన్వేషించండి

Honeymoon Express: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'లో హెబ్బాతో చైతన్య - కింగ్ సపోర్ట్!

Hebah Patel Chaitanya Rao Madadi Movie Honeymoon Express: చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా రూపొందుతున్న సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. కింగ్ అక్కినేని నాగార్జున ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Honeymoon Express Telugu Movie First Look: '30 వెడ్స్ 21' యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు చైతన్య రావు. ఆ తర్వాత ఆయన సోలో హీరోగా కొన్ని సినిమాలు చేశారు. కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ కూడా చేశారు. ఇటీవల 'కీడా కోలా'లో సందడి చేశారు. ఇప్పుడు ఆయన సోలో హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లుక్ వచ్చింది. 

రొమాంటిక్ కామెడీగా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'
చైతన్య రావు (Chaitanya Rao Madadi) హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' (Honeymoon Express Telugu Movie). ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్. ఎన్ఆర్ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కెకెఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, సుహాసిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాల రాజశేఖరుని రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీత దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న చిత్రమిది.

ఫస్ట్ లుక్ విడుదల చేసిన కింగ్ నాగార్జున!
Nagarjuna Akkineni released Honeymoon Express First Look: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా ఫస్ట్ లుక్ కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా 'బిగ్ బాస్' హౌస్ సెట్‌లో కింగ్ రూములో విడుదలైంది. అనంతరం నాగార్జున మాట్లాడుతూ... ''దర్శకుడు బాల నాకు చాలా సుపరిచితులు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (annapurna film institute)కి డీన్ గా వ్యవహరించారు. హాలీవుడ్ సినీ నిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు చెప్పారు. ఈ సినిమాలో మా విద్యార్థులకు అవకాశాలు ఇచ్చారు. సినిమాలో వినోదంతో పాటు చక్కటి సందేశం ఉంది. కళ్యాణి మాలిక్ గారి పాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా తప్పకుండా విజయం సాదించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.

Also Read: కళ్యాణ్ రామ్ 'డెవిల్' చూసిన 'దిల్' రాజు - 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్!

Honeymoon Express: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'లో హెబ్బాతో చైతన్య - కింగ్ సపోర్ట్!
దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ "నేను అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సిటీలో ఉన్నప్పుడు ఎన్నో హాలీవుడ్ సినిమాలకు పని చేశా. తెలుగు సినిమా చేయాలనేది నా కల. శ్రీమతి అక్కినేని అమల గారి ప్రోద్భలంతో ఇండియా వచ్చాను. మేడంతో పాటు నాగార్జున గారి ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమలో ప్రవేశించా. నాకు ఎప్పుడు మద్దతుగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ... ఈ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన కింగ్ నాగార్జున గారికి థాంక్స్. యువతకు, ప్రేమికులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు.

Also Read'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్

చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా... తనికెళ్ల భరణి, సుహాసిని, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్వరాలు: కల్యాణి మాలిక్, నేపథ్య సంగీతం: ఆర్పీ పట్నాయక్, సాహిత్యం: కిట్టూ విస్సప్రగడ, కళా దర్శకత్వం & ఛాయాగ్రహణం: శిష్ట్లా  విఎమ్కే, కూర్పు: ఉమా శంకర్ జి (యుఎస్ఎ) & శ్రీ కృష్ణ అత్తలూరి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget