అన్వేషించండి

Samajavaragamana Teaser: ప్రేమించిన అమ్మాయిలతో రాఖీ కట్టించుకోవడం ఏంట్రా బాబూ, ఫన్నీ ఫన్నీగా 'సామజవరగమన' టీజర్

శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'సామజవరగమన' సినిమా మే 18వ విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఫుల్ కామెడీతో ఆకట్టుకుంటోంది.

సరికొత్త కథలతో సినిమాలు చేయడంలో ముందుంటారు యంగ్ హీరో శ్రీ విష్ణు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  బిగిల్ సినిమాలో ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబా జాన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 18న విడుదల కానుంది.

ఫుల్ ఫన్నీగా 'సామజవరగమన' టీజర్

ఈ నేపథ్యంలో 'సామజవరగమన' సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిప్స్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఓ రేంజిలో అంచనాలను పెంచేసింది. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో నిండిపోయింది. శ్రీవిష్ణు పంచులకు ప్రేక్షకులు పడిపడి నవ్వుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయిలతో హీరో రాఖీ కట్టించుకోవడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అమ్మాయిల మీద ప్రేమ కలగకపోవడానికి గల కారణం చెప్పిన నవ్విస్తారు. ఇప్పటికే విడుదలైన 'సామజవరగమన' గ్లింప్స్ సైతం బాగా ఆకట్టుకుంది. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరికీ కాస్ట్ ప్రాబ్లమ్స్, లేదా మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నాకేంటి ఈ సమస్య వచ్చింది అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు ఈ దెబ్బతో శ్రీవిష్ణు ఖాతాలో మంచి హిట్ పడటం ఖాయం అంటున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ .. నరేశ్ .. శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఆకట్టుకుంటున్న లిరికల్ సాంగ్

అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి  విడుదలైన లిరికల్ సాంగ్ ను కూడా సినీ అభిమానులను అలరించింది. 'ఏం బోర్ కొట్టిందో' అంటూ సాగే ఈ పాటలో  హీరో మందుకొట్టి  ఫ్రెండ్స్ తో కలిసి చిందులేస్తూ కనిపిస్తాడు. గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. జెస్సీ గిఫ్ట్ ఈ పాటను పాడారు.   

'రాజ రాజ చోర' తర్వాత నో హిట్

నిజానికి శ్రీవిష్ణు ఇప్పటి వరకు 10 సినిమాలు చేశారు. అందులో ముచ్చటగా మూడు సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఒకప్పుడు ఈయనతో సినిమా చేస్తే మినిమం హిట్ గ్యారెంటీ అనుకునే వారు దర్శకనిర్మాతలు, కానీ ఆ తర్వాత పూర్తిగా ఫ్లాప్ సినిమాలు చేయడంతో తెరమరుగు కావడం ఖాయం అనుకున్నారు. కానీ, మళ్లీ 'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'రాజ రాజ చోర' మూవీ తర్వాత శ్రీవిష్ణుకి ఇంతవరకూ హిట్ దక్కలేదు. ఈ సినిమాతో ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sree Vishnu (@sreevishnu29)

Read Also: భార్యను తమిళంలో మాట్లాడాలన్న రెహమాన్, నెటిజన్లు ఆగ్రహం - అందులో తప్పేముంది?

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam Review - 'ఆదర్శ కుటుంబం' రివ్యూ: వెంకీతో త్రివిక్రమ్ కొత్త సినిమా - హిట్టా? ఫట్టా?
'ఆదర్శ కుటుంబం' రివ్యూ: వెంకీతో త్రివిక్రమ్ కొత్త సినిమా - హిట్టా? ఫట్టా?
Mirzapur Movie OTT : ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన 'మీర్జాపూర్' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన 'మీర్జాపూర్' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vatsala Rajagopal : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - 'అదుర్స్' బామ్మ ఇక లేరు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - 'అదుర్స్' బామ్మ ఇక లేరు
Mrunal Thakur : 'సీతామహాలక్ష్మి రోల్ నేను చేయాల్సింది కాదు' - సీతారామంపై మృణాల్ ఠాకూర్ రియాక్షన్
'సీతామహాలక్ష్మి రోల్ నేను చేయాల్సింది కాదు' - సీతారామంపై మృణాల్ ఠాకూర్ రియాక్షన్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Vatsala Rajagopal : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - అదుర్స్ బామ్మ ఇక లేరు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - అదుర్స్ బామ్మ ఇక లేరు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Embed widget