Ram Pothineni: గర్ల్ ఫ్రెండ్ తో రామ్ పెళ్లి - త్వరలోనే ప్రకటన?
తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయితో రామ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో చాలా మంది యంగ్ హీరోలు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు. గత మూడేళ్లలో చాలా మంది సెలబ్రిటీలు వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవాల్సిన బ్యాచిలర్ బాబులు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారిలో రామ్ పోతినేని ఒకరు. అయితే ఇప్పుడు రామ్ తన గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయితో రామ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందని టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. ఇదివరకు ఇలానే రామ్ పెళ్లి గురించి వార్తలు రాగా.. పెళ్లి అనేది మన చేతుల్లో ఉండదని.. జరగాల్సిన సమయంలో జరుగుతుందని అన్నారు.
ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే ఉంది. రామ్ నటిస్తోన్న 'వారియర్' సినిమా రిలీజ్ తరువాత ఎంగేజ్మెంట్ చేసుకొని.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే రామ్ ప్రేమిస్తున్న అమ్మాయి వివరాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ పెళ్లి వార్తలపై రామ్ స్పందిస్తారేమో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో 'వారియర్' సినిమాలో నటిస్తోన్న రామ్ దీని తరువాత బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. అలానే ఆయన లిస్ట్ లో మరికొంతమంది దర్శకులు ఉన్నారు.
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















