Nayan-Vicky: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి భోజనం - ఎన్ని వెరైటీలో!
శాఖాహారం, మాంసాహారం రెండూ కూడా నయన్ పెళ్లి విందులో వడ్డించారు.
చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార-విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అతి తక్కువ మంది సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
ఇండస్ట్రీ నుంచి కూడా పేరున్న సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. రజినీకాంత్, మణిరత్నం, బోనీకపూర్, అట్లీ, విజయ్ సేతుపతి, అనిరుద్ ఇలా చాలా మంది ప్రముఖులు నయన్-విక్కీల పెళ్లికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. వీరి పెళ్లి భోజనంకి సంబంధించిన మెనూ ఒకటి బయటకొచ్చింది. ఈ మెనూ ప్రకారం.. తమిళనాడు, కేరళకి చెందిన సంప్రదాయ ఫుడ్ ఐటమ్స్ ను నయన్-విక్కీ సెలెక్ట్ చేసినట్లు ఉన్నారు.
శాఖాహారం, మాంసాహారం రెండూ కూడా పెళ్లి విందులో వడ్డించారు. పనస బిరియాని, ఆవియాల్, మో కొజంబు, పనీర్ పట్టని, చికెన్ చెట్టినాడ్ కర్రీ, సాంబార్ సాధం, పూందు మిలగు రసం ఇలా ఎన్నో వెరైటీస్ ను నయన్ పెళ్లిలో రుచి చూశారు అతిథులు. డిసర్ట్ లో భాగంగా బాదం హల్వా, ఎలనీర్ పాయసం, ఐస్ క్రీమ్ పెట్టారు.
Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ
Also Read: అరుదైన సినిమా, బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్ళండి - '777 చార్లీ' చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే?
Here is the menu of #NayantharaVigneshShivan wedding. #Nayantharawedding #VigneshShivan #Nayanthara pic.twitter.com/bBomwwDaBs
— NAYANwedsWIKKI🎊 (@kalonkarthik) June 9, 2022
View this post on Instagram