Happy Birthday Gautham Vasudev Menon: హ్యాపీ బర్త్ డే గౌతమ్ మీనన్ - మేకింగ్ లోనే కాదు, యాక్టింగ్‌లోనూ ఈయన వెరీ స్పెషల్!
దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎన్నో అద్భుత సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం నటుడిగానూ రాణిస్తున్నారు. తాజాగా ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకుని 51వ ఏట అడుగు పెట్టారు.
Happy Birthday Gautham Vasudev Menon: గౌతమ్ వాసుదేవ్ మీనన్... లవ్, యాక్షన్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. మూవీ మేకింగ్‌లో తన మార్క్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న కథలతో ఆయన తెరకెక్కించిన సినిమాలను అభిమానులను ఎంతో అలరించాయి. కొంత కాలం పాటు దర్శకుడిగా రాణించిన ఆయన, ఆ తర్వాత నటుడిగా మారారు. పాత్ర ఏదైనా ఒదిగిపోయి నటిస్తున్నారు. ఓవైపు దర్శకుడిగా, మరోవైపు నటుడిగా రాణిస్తున్న గౌతమ్ మీనన్ బర్త్ డే ఇవాళ. 50 ఏండ్లు పూర్తి చేసుకుని 51వ ఏట అడుగు పెట్టారు.
కాలేజీ రోజుల్లోనే సినిమాలపై మోజు
గౌతమ్ మీనన్ 1973లో కేరళలోని పలక్కడ్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి కేరళకు చెందిన వాడు కాగా, తల్లి తమిళియన్. గౌతమ్ తిరుచ్చిలో పెరిగారు. కాలేజీ రోజుల్లోనే సినిమాపై ఆసక్తిని పెంచుకున్నారు. తల్లింద్రుడులకు ఈ విషయాన్ని చెప్పి, వారి అనుమతితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరీర్ ప్రారంభంలో రాజీవ్ మీనన్ దగ్గర పలు యాడ్ ఫిలిమ్స్ చేశారు. ఆ తర్వాత 1997లో ‘మిన్సర కనవు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఇందులో ఆయన ఓ పాత్రను కూడా పోషించారు. 2001లో మాధవన్, అబ్బాస్, రీమాసేన్ ప్రధాన పాత్రల్లో ‘మిన్నెల’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో 'చెలి' పేరుతో డబ్ చేశారు. ఆయన తీసిన తొలి మూవీ హిట్ కావడంతో గౌతమ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత సూర్య హీరోగా 'కాక్క కాక్క' సినిమాతో యాక్షన్ జోనర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదే సినిమాను వెంకటేష్ హీరోగా 'ఘర్షణ' పేరుతో రీమేక్ చేశారు. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. నాగ చైతన్య హీరోగా ‘ఏ మాయ చేసావె’ సినిమా చేశారు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తమిళంలో శింబు, త్రిష జంటగా ‘విన్నైతాండి వరువాయ’ పేరుతో రూపొందించారు. ఆ తర్వాత చేసి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. గౌతమ్ మీనన్ సినిమాల్లోని చక్కటి డైలాగులు, సహజమైన వర్ణన, అంతకు మించి అద్భుతమైన స్త్రీ పాత్రలు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి.
నటుడిగానూ ఆకట్టుకుంటున్న గౌతమ్ మీనన్
గత కొంత కాలంగా గౌతమ్ మీనన్ యాక్టర్ గానూ రాణిస్తున్నారు. పలు చిత్రాలలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు నటుడిగా ఆయన చేసిన ‘ట్రాన్స్’, ‘కనులు కనలలను దోచాయంటే’, ‘ఎఫ్ఐఆర్’, ‘డాన్’, ‘మైఖేల్’, ‘లియో’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చక్కగా ఆడాయి. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. దర్శకుడిగా, నటుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తోంది ABP Desam.
View this post on Instagram
Read Also: ఆయన ఇన్‌స్టాగ్రామ్ వాడరు - ఎందుకో చెప్పేసిన కరీనా కపూర్