Teja Sajja: ఆరేళ్ల కిందటే ‘హనుమాన్’ గురించి తేజ సజ్జ హింట్ - చెప్పినట్లే అదిరిపోయే హిట్
Teja Sajja: తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 6 ఏండ్ల క్రితం తేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Teja Sajja Intresting Words About Prasanth Varma: తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. వీకెండ్ వరకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 6 రోజుల్లో రూ.67.27 కోట్ల షేర్ వసూళు చేసింది. ఇప్పటి వరకు రూ.38.77 కోట్ల లాభాలను అందుకుంది.
‘RRR’, ‘బాహుబలి’, ‘సలార్’ రికార్డులు బ్రేక్
సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలను వెనక్కి నెట్టి మరీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది ‘హనుమాన్‘. రోజు రోజుకూ వసూళ్ల వర్షం కురిపిస్తూ ముందుకెళ్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. తొలి వారంలో ‘RRR’, ‘బాహుబలి’, ‘సలార్’ రికార్డులను ‘హనుమాన్’ బద్దలు కొట్టింది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు నటీనటులు ప్రశంసలు కురిపించారు. ప్రశాంత్ వర్మ టేకింగ్, తేజ సజ్జ యాక్టింగ్ మరో లెవెల్ అంటున్నారు.
6 ఏళ్ల క్రితమే చెప్పేసిన తేజ సజ్జ
‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ హిట్ నేపథ్యంలో తేజ సజ్జకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘ఆ!’ సినిమా సమయంలో తేజ ప్రశాంత్ ను అభినందిస్తూ మాట్లాడిన మాటలు ‘హనుమాన్’ సినిమాకు సరిగ్గా సూట్ అవుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ తేజ సజ్జ ఏమన్నాడంటే?“ 4 ఏళ్ల తర్వాత, లేదంటే 5 ఏళ్ల తర్వాత మనం ఓ సినిమా చేస్తాం. ఆ రోజు ఆడియో ఫంక్షన్ లో మైకులోనో, లేదంటే మరో చోటో మన గురించి చెప్పుకోవాలి అనుకున్నాం. ఎలాంటి సినిమాలు చేయాలి అనుకునే విషయంలో ప్రశాంత్ కు క్లారిటీ ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేసేందుకు చాలా ప్రయత్నించాం. పొద్దున లేస్తే కలిసే వాళ్లం. మేం ఇద్దరు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లాగ కలిసి ఉండే వాళ్లం. రోజుకు మూడుసార్లు మీటయ్యే వాళ్లం” అన్నారు. అటు ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టకుండా సినిమాలు చేయాలన్నదే తన లక్ష్యం అని ప్రశాంత్ వర్మ చెప్పారు.
6 years back @tejasajja123 words about @PrasanthVarma
— S (@UrsShareef) January 16, 2024
💎 From TFI #HanumanMovie #Hanuman#HanumanHits100cr pic.twitter.com/qVXLFUNCXo
ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ చిత్రంలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. ఒక సాధారణ యువకుడు ‘హనుమాన్’ కారణంగా సూపర్ పవర్స్ సాధిస్తే, ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
Also Read: రోజూ రెండు రౌండ్లు మద్యం, స్వీట్స్ తినకపోతే నిద్ర రాదు - నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవేనట
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















