News
News
X

Hansika Motwani Wedding: పెళ్లికూతురు కాబోతున్న ఆపిల్ బ్యూటీ? జైపూర్‌ రాచకోటలో అట్టహాసంగా వివాహ వేడుక?

అందాల ముద్దుగుమ్మ హన్సిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నది. జైపూర్ కోట్లలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నది. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి.

FOLLOW US: 

హన్సిక మోత్వానీ.. బాలనటిగా బాలీవుడ్‌లో అడుగు పెట్టి, సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో చేసింది కొద్ది సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ సినిమాల దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయినా, టాలీవుడ్ లోపెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పుకోచ్చు. స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మినహా మరెవరితోనూ నటించలేదు. జూనియర్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ ‘కంత్రీ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత  ‘కందిరీగ’ లాంటి సినిమా హిట్ కొట్టినా ఆమె కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు. తెలుగులో చివరి సారిగా మంచు విష్ణుతో కలిసి ‘లక్కున్నోడు’ సినిమా చేసింది. ఆ తర్వాత పూర్తిగా తమిళ సినిమా పరిశ్రమకే పరిమితం అయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మను దాదాపు మర్చిపోయారు.  తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ ముంబై బ్యూటీకి ఏకంగా గుడి కట్టి పూజలు చేస్తున్నారు. 

Read Also: పాన్ ఇండియన్ స్టార్ తో పవర్ స్టార్ బ్యూటీ జోడీ, నిధి అగర్వాల్ కు సూపర్ ఆఫర్!

డిసెంబర్ లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న హన్సిక!

ఇక ఈమె సినీ కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే.. ఈ అందాల తార త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నది. డిసెంబరులో పెళ్లికూతురుగా ముస్తాబు కాబోతోంది. గత కొంత కాలంగా ఈమె పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు వాస్తవమేని చెప్పింది హన్సిక. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఈ ఏడాది జైపూర్ కోటలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయినట్లు వెల్లడించింది. అయితే, పెళ్లి కొడుకు ఎవరు? అనే విషయాన్ని మాత్రం బయటకు వెళ్లడించలేదు.  హన్సిక వివాహానికి  రాజస్థాన్‌ జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోట ముస్తాబు అవుతున్నది.  దీనికోసం ఈ హోటల్‌లోని అన్ని గదులు, సూట్లను  ఇప్పటికే బుక్‌ చేసినట్టు తెలుస్తున్నది.  ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌ లో జరిగే ఈ వివాహ వేడుకకు వచ్చే అతిథులకు రాచమర్యాదలు దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నామని హన్సిక చెప్పింది.

News Reels

15 ఏండ్ల సినీ కెరీర్

1991 ఆగష్టు 9న ముంబైలో జన్మించిన హన్సిక.. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాలో బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. 2007 నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న ఈ అమ్మడు 15 ఏండ్ల ఫిల్మ్ కెరీర్ పూర్తి చేసుకుంది. హీరోయిన్ గా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. తాజాగా హన్సిక నటించిన ‘పార్ట్‌నర్‌’, ‘105 మినట్స్‌’ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు.  తెలుగులో ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’, తమిళంలో నాలుగు సినిమాలు నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి.

Published at : 17 Oct 2022 10:45 AM (IST) Tags: Hansika Motwani Hansika Motwani Wedding Jaipur fort

సంబంధిత కథనాలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి