By: ABP Desam | Updated at : 15 Feb 2022 09:29 PM (IST)
Image Credit: Manchu Vishnu/Twitter
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల సమస్య కొలిక్కి వస్తుందని ఆశిస్తున్న సమయంలో.. మంచు విష్ణు మరో వివాదానికి తెర లేపారు. మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల సీఎంతో సినీ ప్రముఖల సమావేశానికి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేని అంటున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. ఆహ్వానం అందినా.. మోహన్ బాబుకు తెలియజేయలేదని, ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్‌లో మాట్లాడతామని విష్ణు తెలిపారు. తమకు ఆ ఆహ్వానం అందకుండా చేసింది ఎవరో తెలుసన్నారు. ఈ విషయాన్ని మేం అంతర్గతంగా మాట్లాడుకుంటామని పేర్కొన్నారు.
ఈ భేటీకి తాను సినీ పరిశ్రమ తరపున లేదా హీరోగా హాజరుకాలేదని, వ్యక్తిగత హోదాలోనే వచ్చానని విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌తో తాను అనేక విషయాల గురించి చర్చించానని, అవి బయటకు వెల్లడించనని తెలిపారు. సినీ పరిశ్రమ గురించి తాను మాట్లాడిన అంశాలను మరో వేదికపై వెల్లడిస్తానన్నారు. తిరుపతిలో తమ కుటుంబం తరపున స్టూడియో నిర్మిస్తామని విష్ణు తెలిపారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాకు రెండు కళ్లు. విశాఖలో మాకు అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనిపై ఫిల్మ్‌ఛాంబర్‌తో మాట్లాడి, ఎప్పుడు షిప్టు అవ్వాలో నిర్ణయించుకుంటాం’’ అని పేర్కొన్నారు.
Also Read: టాలీవుడ్ సమస్యలపై జగన్‌ను కలవను, తేల్చేసిన బాలకృష్ణ
ఆ తర్వాత ఆయన ట్విట్టర్ వేదికగా సీఎంతో జరిగిన భేటీ గురించి పోస్ట్ చేశారు. ‘‘జగన్ అన్నతో కలిసి లంచ్ చేశాను. వివిధ అంశాల మీద ఆయనకు ఉన్న నాలెడ్జ్ జస్ట్ బ్రిలియెంట్’’ అని ట్వీట్ చేశారు. దీంతో నెటిజనులు మరోసారి ఆయన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘వార్త’లో వర్ణించలేని విధంగా ఆయన్ని విమర్శిస్తున్నారు. కొద్ది రోజుల కిందట కూడా నెటిజనులు ఈ విధంగానే మంచు విష్ణును ట్రోల్ చేశారు. మంత్రి పేర్ని నానితో మోహన్ బాబు ఇంట్లో జరిగిన భేటీ గురించి విష్ణు ట్వీట్ చేశారు. అది వివాదాస్పదం కావడంతో దాన్ని డిలీట్ చేసి, మరో ట్వీట్ చేశారు.
Had lunch with @ysjagan anna. His knowledge on various subjects is just brilliant. 💪🏽
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2022
ఇటీవల డిలీట్ చేసి.. మళ్లీ పోస్ట్ చేసిన ట్వీట్ ఇదే:
It was a absolute pleasure hosting you at our home Sri. Nani garu. Much thanks for protecting the interests of TFI 🙏 pic.twitter.com/HjV3pK8yYJ
— Vishnu Manchu (@iVishnuManchu) February 11, 2022
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్‌టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం