By: ABP Desam | Updated at : 26 Jan 2023 08:45 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedanta Manasu January 26th Update ( (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు జనవరి 26 ఎపిసోడ్ (Guppedanta Manasu January 26th Update)
మినిస్టర్ దగ్గరకు తన కారులో తీసుకెళ్లిన రిషి..వసుధారను తిరిగి తీసుకెళుతుండగా రాజీవ్ కారును అడ్డంగా ఆపుతాడు. రిషికి ఏం చేయాలో తెలియక కారు ఆపేసి ఆగిపోతాడు.
వసుధార: కారు ఆపొద్దు సార్..పోనివ్వండి
రిషి: తను వస్తున్నాడు కదా అలా ఎలా వెళ్లిపోతాం వసుధారా
వసుధార: నాకు మీరు ఇంపార్టెంట్ సార్
షాక్ అయిన రిషి..రాజీవ్ దగ్గరకు రావడంతో కారు దిగుతాడు
రాజీవ్: రిషి సార్ నా భార్యని నాతో పంపిస్తారా
వసుధార: నేను రాను..రిషి సార్ తోనే వెళతాను..
ఏం జరుగుతోందో అర్థంకాక సైలెంట్ గా నిల్చుంటాడు రిషి
వసుధార: అసలు ఏం జరిగిందో మీకు తెలియాలి సార్..చెబుతాను వినండి అంటుంది..
చూస్తుంటే..మొత్తానికి నిజం చెప్పే అవకాశం వసుధారకి వచ్చింది..మరి ఈగో మాస్టర్ వింటాడో వినడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే...
బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
చీకట్లో రిషి ఒంటరిగా నడిచివెళుతుంటాడు...వెనుకే ఫాలో అవుతుంది వసుధార... గమనించిన రిషి..నా వెనుక ఉన్నది నువ్వే అని తెలుసు ముందుకు రా అంటాడు
వసు: మాట్లాడాలి సార్
రిషి: నాకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చేశాయి నన్ను విసిగించకు వెళ్లిపో అని కోప్పడతాడు
వసుధార అసలు విషయం చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా పట్టించుకోడు... ఎందుకిలా చేశావో అర్థం కావడం లేదని బాధపడతాడు.. తనను మాట్లాడనివ్వడం లేదని వసు ఫీలవుతుంది...
రిషి ఓ బెంచ్ పై కూర్చుని ఎదురుగా కప్పులు పెట్టుకుని రాళ్లు విసురుతూ ఉంటాడు...వసుధార వచ్చి పక్కన కూర్చుంటుంది. వెంటనే కోపంగా లేచివెళ్లిపోతాడు రిషి... వసుధార పిలవడంతో వెనక్కు తిరిగి చూసి మెడలో తాళి కనిపించడంతో మళ్లీ బాధపడతాడు...
వసుధార: ఈ రోజు నేను చెబుతున్నాను..మీరు వినండి...
రిషి: ఏమీ జరగనట్టు ఎప్పటిలా ఎలా మాట్లాడుతున్నావ్..నీకెలా సాధ్యమవుతోంది అనుకుంటాడు..
వసుధార: నాకోసం రెండు నిముషాలు కేటాయించండి..
రిషి: ఈ టైమ్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు..వెళ్లు
వసు: గౌతమ్ సార్ ఫ్లాట్ వైపు మీరెందుకు వచ్చారని అడుగుతుంది..
రిషి..మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతాడు..
Also Read: నిను తలవక గడవదు కాలం - నిను కలవక నిలవదు ప్రాణం, రిషి చుట్టూ వసు చక్కర్లు
ఇంటికెళ్లిన వసుధార ఫోన్ పట్టుకుని రిషి మాటలు తలుచుకుని బాధపడుతుంది. వసు కన్నీళ్లు చూసిన తండ్రి చక్రపాణి ఓదార్చుతాడు..కోపంలో రిషి సార్ ఓ మాట అన్నా ఓర్చుకో అని చెబుతాడు. అపార్థాలను నిర్లక్ష్యం చేయవద్దు, అవి తొలగించుకోకుంటే జీవిత ప్రయాణం ప్రమాదం తల్లీ..ఆలస్యం చేయకు జరిగినవన్నీ చెప్పు అంటాడు తండ్రి. నీవల్ల కాకపోతే నేను వెళ్లివాళ్ల కాళ్లు పట్టుకుంటాను అనిచెప్పి వసుధారకు ధైర్యం చెబుతాడు. నాకు అసలు చెప్పే అవకాశం ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార.
మర్నాడు కాలేజీలో జగతి-మహేంద్ర...రిషి గురించి మాట్లాడుకుంటారు. అనుకున్నదానికన్నా రిషి తొందరగానే గాయం నుంచి బయటకొచ్చాడు అంటాడు మహేంద్ర. అందర్నీ వదిలి వెళతానని చెప్పి మళ్లీ వెనక్కు రావడం ఆశ్చర్యకరమే కానీ కళ్లెదురుగా వసుధార కనిపిస్తే ఆ గాయం మరింత బాధ కలిగిస్తుంది అంటుంది జగతి. అసలు వసుధార ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదని బాధపడిన మహేంద్ర...అందరకీ దూరంగా ఉంటున్నాడని బాధపడతాడు. రిషి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోపోవడమే తనకి మనం చేసే హెల్ప్ అవుతుంది అంటుంది జగతి..
Also Read: 'కార్తీకదీపం' సీక్వెల్ - ఆ ప్రశ్నలకు సమాధానం దొరికేది అప్పుడేనా!
కళ్లు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావ్ అని గుర్తుచేసుకుంటాడు రిషి..అటు వసుధార వీఆర్ ఉంగరాన్ని చూస్తూ మాట్లాడుకుంటుంది..ఫోన్ తీసి కాల్ చేస్తుంది...లిఫ్ట్ చేసిన రిషితో...మినిస్టర్ గారి దగ్గరకు వెళ్లాలి అనుకుంటున్నాను మీరు కూడా నాతో వస్తారా అని అడుగుతుంది..రిషిమాత్రం మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు.
కాలేజీలో స్టాఫ్ ని పిలుస్తుంది వసుధార..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి చదవమని ఫైల్ ఇస్తుంది.. ఇందులో చదవడానికి ఏముందిలెండి అని నిర్లక్ష్యంగా అంటారు..ఇక్కడే ఫైల్ మొత్తం చదవండి అంటుంది. అక్కడే కూర్చుని వసుధార పెళ్లి గురించి అసహ్యంగా మాట్లాడతారు... అవి విని ఫైర్ అవుతుంది వసుధార...నా పెళ్లి గురించి మీకు అనవసరం అని స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తుంది. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదని తిట్టి పడేస్తుంది..ఫైల్ చదవి అవగాహన పెంచుకోండి.. మినిస్టర్ గారితో మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పేలా ఉండాలని క్లాస్ వేస్తుంది..
మినిస్టర్ దగ్గరకు వెళుతుండగా మధ్యలో కారు చెడిపోవడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తారు..క్యాబ్ బుక్ చేసుకుందాం అంటుంది వసుతో వచ్చిన మేడం.. మళ్లీ వసుధార పెళ్లి గురించి ప్రస్తావించినా మాట దాటేస్తుంది వసుధార.. ఇంతలో అదే రూట్లో వచ్చిన రిషి.. కారు ఆగిపోయిన విషయం తెలుసుకుని డ్రాప్ చేయడానికి రమ్మంటాడు.. వసు ఏ సీట్లో కూర్చుంటుందో అని ఆలోచిస్తాడు.. వసు కూడా అదే ఆలోచనతో వెనుక సీట్లో కూర్చుంటుంది. రిషి - వసు ఇద్దరూ బాధపడతాడు. ఈలోగా వెనుక కూర్చున్న కాలేజీ మేడం మళ్లీ వసుధార పెళ్లి గురించి ప్రస్తావిస్తుంది. అసలే రిషి సార్ బాధపడుతుంటే ఈ మేడం ఏంటో అనుకుంటూ ఈ టాపిక్ వదిలేయండి అంటుంది.
RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
Guppedanta Manasu January 31st Update: ప్రేమే సమస్య అన్న రిషి, ప్రేమను ప్రేమ గెలిపించుకుంటుందన్న వసు - దేవయానికి షాకుల మీద షాకులు
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Ennenno Janmalabandham January 31st: మాళవిక చెంప పగలగొట్టిన వేద- భ్రమరాంబిక ముందు నిజం బట్టబయలు
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్ ఉన్న ట్రక్ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు
గీజర్లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఈ ఏడాది బడ్జెట్ ఎప్పుడు ఎలా చూడాలి? తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు?