అన్వేషించండి

Guppedanta Manasu December 16th Update: అత్తారింటికి దారేది అంటూ బయలుదేరిన రిషి, వసుతో జంటగా తిరిగొస్తాడా!

Guppedantha Manasu December 16th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంత మనసు డిసెంబరు 16 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 16th Update Today Episode 635)

వసుధారని టార్గెట్ చేసి సూటిపోటి మాటలతో హింసించిన దేవయాని..వసుధార వెళ్లిపోవడంతో సంతోషంగా ఉంటుంది. హాయిగా సోఫాలో కూర్చుని ధరణి అని పిలుస్తుంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానంటూ మాట్లాడుతుంది. కాఫీ, స్వీట్స్ కాదు..ఏదైనా హాట్ తీసుకురా అంటుంది. ఈవిడ వసుధారని పంపించినందుకు హ్యాపీగా ఉందని నాకు అర్థమైందిలే అనుకుంటుంది ధరణి. ఇంతలోనే రిషి.. వసుధార కోసం బొకే తీసుకొని వస్తుండడం చూసి దేవయాని ఆశ్చర్య పోతుంది. పెద్దమ్మా వసుధార ఎక్కడ ఉందని అడగడంతో దేవయాని టెన్షన్ పడుతుంది. వసుధార కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెబుతుంది. ఎక్కడికి అని అడిగితే..వెళ్లే వాళ్ళందరూ నాకు చెప్పి వెళ్తారా ఏంటి నాన్న రిషి అని డ్రామా చేస్తుంది. కాలేజీలో ఎవరో ఏదో అన్నారట దాంతో కోపంగా వచ్చి ఇల్లు వద్దు మీరు వద్దు అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనడంతో రిషి షాక్ అవుతాడు. నాకే కాదు రిషి నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అంటుంది. అప్పుడు రిషి కోపంగా జగతి గదిలోకి వెళతాడు
రిషి:ఎవరో ఏదో అన్నారని పెద్దమ్మ చెప్పింది ఏం జరిగింది చెప్పండి మేడం
జగతి: అక్కయ్య గారు తనకు అనుగుణంగా చెప్పుకుని ఉంటుంది అనుకుంటుంది
రిషి: వసుధార ని ఎవరు ఏమన్నారు చెప్పండి మేడం వాళ్ళ సంగతి చెప్తాను 
జగతి: ఎంతమంది పని చెబుతావు రిషి. ఏం చేస్తావు..ఒకవేళ నేను జరిగింది మొత్తం చెబితే వాళ్ల మీద పోయి అరుస్తావు రేపు మళ్లీ ఇంకొకరు వచ్చి అలాగే మాట్లాడతారు వాళ్ళ మీద కూడా అరుస్తావా అని అంటుంది
రిషి: జగతి మాటలకు ఆలోచనలో పడతాడు రిషి
జగతి: అసలు మగ ఆడ మధ్య సంబంధం గురించి ఎదుటివారికి చెప్పుకోవాల్సిన అవసరం రాకూడదు అలా చెప్పుకుంటూ వెళితే అది బంధమే కాదు రిషి
రిషి: షాక్  అయిన రిషి..వసుధార ఎక్కడికి వెళ్లింది మేడమ్ 
జగతి: ఎక్కడైతే తన బంధాలను వదులుకొని వచ్చిందో ఎక్కడిది తన రక్తసంబంధీకులను వదులుకొని వచ్చిందో అక్కడికే వెళ్లింది 
జగతి మాటలకు ఆలోచనలో పడిన రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు..

Also Read: చారుశీల సాయం అడిగిన శౌర్య, కార్తీక్ ని అనుమానిస్తున్న దీప, తల్లడిల్లిపోతున్న సౌందర్య

మరొకవైపు వసుధార ఇంటికి వెళ్లడంతో అక్కడ ఇంటి ఓనర్ వసుధార గురించి హేళనగా మాట్లాడి..నువ్వెప్పుడు వస్తావో ఎప్పుడు రావో తెలియదంటూ రిషి-వసు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. వసుధార లగేజ్ మొత్తం బయట పడేస్తుంది. చేసేది లేక ఆ లగేజ్ తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ కూర్చుంటుంది. కాలేజీ స్టాఫ్ ఇంటి ఓనర్ అన్న మాటలు తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది వసుధార. ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు.
రిషి: నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు ..ఏం జరిగింది వసుధార ఇల్లు ఖాళీ చేశావా 
వసు: లేదు సార్ చేయించారు ..మీరు అడిగారు కానీ ఎందుకు అన్నది నేను చెప్పలేను కానీ మాటలతో చాలా బాధ పెట్టారు సార్ . టెక్నాలజీ మారింది డెవలప్ అయింది అంటున్నారు కానీ ఆడపిల్ల మాత్రం సమాజం దృష్టిలో అలాగే ఉంది సర్. ఆడ మగ కనిపిస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు.
రిషి: రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంటాడు.....వసుధార మా ఇంటికి వెళ్దాం పద 
వసు: మీ ఇల్లు అన్నారు కదా సార్ మరి ఆ ఇంటికి నాకు ఏంటి సార్ సంబంధం . ఏ అర్హతతో నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. 
నేను ఆ ఇంటికి ఏ హక్కుతో రావాలి చెప్పండి సార్.  అతిథిగా అయితే రెండు మూడు రోజులు ఉండొచ్చు. ప్రతీసారీ మీ ఇంటికొచ్చి కూచుంటే చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి సార్ . అందరికీ నేను సమాధానం చెప్పాలి అనుకోవడం లేదు సార్ అందుకే మా ఊరికి వెళ్ళిపోతున్నాను. 

Also Read: దేవయానితో సవాల్ చేసి ఇంట్లోంచి వెళ్లిపోయిన వసు, బొకే తీసుకుని బయలుదేరిన రిషి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Distributes Pension: ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం, యల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం, యల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Distributes Pension: ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం, యల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం, యల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Naga Vamsi: ఏంటి బ్రో అంత మాట అనేశావ్... బోనీ కపూర్‌ ముందు బాలీవుడ్‌ను ఏకిపారేసిన నాగ వంశీ
ఏంటి బ్రో అంత మాట అనేశావ్... బోనీ కపూర్‌ ముందు బాలీవుడ్‌ను ఏకిపారేసిన నాగ వంశీ
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Embed widget