By: ABP Desam | Updated at : 01 Feb 2023 04:54 PM (IST)
'శాకుంతలం' సినిమాలో సమంత
సినిమా ఇండస్ట్రీలో వెనక్కి, ముందుకు వెళ్ళడం సహజమే. ఒక్కోసారి అనుకున్న సమయానికి పనులు కాకపోతే వాయిదా వేయక తప్పదు. అయితే, ఒకటికి రెండు సార్లు సినిమా వాయిదా పడితే ప్రేక్షకులలో నెగిటివ్ ఇంప్రెషన్ పడే ప్రమాదం ఉంది. అందులోనూ సమంత 'శాకుంతలం' ట్రైలర్ విడుదలయ్యాక నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది నెటిజన్స్ నుంచి! ఈ తరుణంలో వాయిదా పడిందనే వార్త ఆమె అభిమానులను కలవరపెడుతోంది.
సమంత రూత్ ప్రభు (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శాకుంతలం' (Shakuntalam Movie). గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఇందులో శకుంతల పాత్రలో సమంత... ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. మహాశివరాత్రి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం ఏంటంటే... ఆ తేదీకి సినిమా రావడం లేదట!
మళ్ళీ 'శాకుంతలం' వాయిదా!
తొలుత గత ఏడాది నవంబర్ 4న 'శాకుంతలం' సినిమాను విడుదల చేయాలని గుణ టీమ్ వర్క్స్ అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ ప్లాన్ చేశాయి. ఎందుకో ఆ తేదీకి రావడం కుదరలేదు. ఆ తర్వాత మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ధనుష్ బైలింగ్వల్ సినిమా 'సార్', సితార సంస్థ నిర్మించిన 'బుట్టబొమ్మ', కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలు కూడా ఆ రోజు విడుదలకు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఫిబ్రవరి 17 పోటీ నుంచి 'శాకుంతలం' తప్పుకొందని, కిరణ్ అబ్బవరం సినిమా ఒక్క రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
'శాకుంతలం' ట్రైలర్ విడుదలైన తర్వాత నెగిటివిటీ ఎక్కువ వచ్చింది. సీరియల్ గ్రాఫిక్స్ చేసినట్టు చేశారని, సినిమాలా లేదని కామెంట్స్ వచ్చాయి. విడుదల వాయిదా పడటానికి ఆ నెగిటివిటీ కారణమా? లేదంటే మరొకటా? అన్నది తెలియాల్సి ఉంది. వాయిదా పడటం వల్ల వీఎఫ్ఎక్స్ వర్క్స్ క్వాలిటీగా చేయించడానికి సమయం లభిస్తుంది.
Also Read : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
ప్రైమ్ వీడియోకి 'శాకుంతలం'?
'శాకుంతలం' ఆల్ లాంగ్వేజెస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. సమంత లాస్ట్ సినిమా 'యశోద' రైట్స్ కూడా ప్రైమ్ దగ్గర ఉన్నాయి.
ఒక్క యశోద మాత్రమే కాదు... సమంత సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్. అంతకు ముందు 'అత్తారింటికి దారేది', 'మజిలీ', 'జాను', 'రంగస్థలం', 'యూ టర్న్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... సమంత సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ప్రైమ్ వీడియోలో ఉన్నాయి.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. ఇంకా దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం.
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
Modi Flexis on Flyover: హైదరాబాద్ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు