Naga Chaitanya And Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభిత పెళ్లి డేట్ ఫిక్స్! ఎప్పుడు? ఎక్కడంటే?
Naga Chaitanya Sobhita : ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ల పెళ్లి ఎప్పుడు? ఎక్కడంటే?

Naga Chaitanya And Sobhita Dhulipala Marriage Date : అక్కినేని హీరో నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. కొంతమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఆగస్టు 8న వాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే, పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదని, కొంచెం టైం తీసుకుంటారని సన్నిహితులు చెప్పారు. కాగా..ఇప్పుడు వాళ్ల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని, వాళ్లిద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి ఎప్పుడంటే?
నాగచైతన్య, శోభిత ఇద్దరు కొంతమంది కుటుంబసభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. రాజస్థాన్ లో వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటు శోభిత, అటు అక్కినేని కుటుంబం ఎవ్వరూ ఈ పెళ్లి గురించి ఇంకా ప్రకటించలేదు.
గప్‌చుప్‌గా నిశ్చితార్థం..
నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత చై, శోభిత ఇద్దరు చాలాసార్లు కలిసి కనిపించారు. దీంతో వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్త చక్కర్లు కొట్టింది. అయితే, దానిపై వాళ్లు ఎవ్వరూ స్పందించలేదు. చాలాసార్లు ఫొటోలు బయటికి వచ్చినప్పటికీ శోభిత, చైతన్య ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. అలా సైటెంట్ గా ఉన్న ఈ జంట గప్ చుప్ గా నిశ్చితార్థం చేసుకుంది. ఆ ఫొటోలను నాగార్జున్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ''శోభితను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకు శుభాకాంక్షలు. జీవితం అంతా ప్రేమ, సంతోషంతో ఉండాలని ఆశీర్వదిస్తున్నా'' అని పోస్ట్ చేశార్ నాగ్. ఆ తర్వాత శోభిత, నాగ చైతన్య కూడా ఫొటోలను షేర్ చేశారు. పెళ్లి ఇప్పట్లో ఉండదని వచ్చే ఏడాది ఉంటుందని నాగార్జున ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. శోభితతో చైతన్య చాలా హ్యాపీగా ఉంటాడని, శోభిత తనకు ముందే తెలుసు అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు నాగ్. కాగా.. 2025 మార్చిలో చై, శోభిత పెళ్లి జరగనున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. నాగ చైతన్య 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి చందు మోండేటి డైరెక్టర్. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుందని త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని బన్నీ వాసు ఇప్పటికే ప్రకటించారు. 'మంకీ మ్యాన్' అనే హాలీవుడ్ సినిమాలో నటించిన 'మేజర్' బ్యూటీ శోభితా ధూళిపాళ.. 'సితార' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల వచ్చిన 'కల్కి 2989 AD' మూవీలో దీపికా పదుకునే పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పింది.
Also Read: చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ అందుకే ఇవ్వలేదా? కుమార్తెతో సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకో?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

