News
News
X

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

రీసెంట్ గా రానా సోషల్ మీడియా నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

FOLLOW US: 

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా ద్వారా మన సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ ను బట్టి వారి పెర్సనల్ లైఫ్ కి సంబంధించిన వార్తలు బయటకొస్తున్నాయి. సమంత విడాకుల రూమర్స్ కూడా ఇలానే మొదలయ్యాయి. ముందుగానే ఆమె తన ప్రొఫైల్ పిక్చర్ ను మార్చింది. ఆ తరువాత తన పేరు నుంచి అక్కినేని తీసేసింది. 

ఆ తరువాత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి చైతుతో ఉన్న ఫొటోలన్నీ డిలీట్ చేసింది. ఇలా ఫ్యాన్స్ ను ప్రిపేర్ చేస్తూ ఫైనల్ గా డివోర్స్ విషయాన్ని చెప్పింది. రీసెంట్ గా రానా కూడా సోషల్ మీడియా నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి అన్ని ఫొటోలను తొలగించారు. దీంతో అతడి మ్యారీడ్ లైఫ్ పై రూమర్స్ మొదలయ్యాయి. 

మిహీకాకి రానాకి మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు ప్రచురించారు. అందుకే రానా సోషల్ మీడియా నుంచి బయటకొచ్చేశారంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. వీటన్నింటికీ ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది మిహీకా. ఈరోజు రానా, మిహీకాల పెళ్లి రోజు. పెళ్లై రెండేళ్లు అవుతున్న సందర్భంగా రానాతో దిగిన కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. లవ్ సింబల్ జోడించింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది సెలబ్రిటీలు రానా-మిహీకాలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ జంట మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలుస్తోంది. 

ఇక రానా సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఆయన చివరిగా 'విరాటపర్వం' సినిమాలో కనిపించారు. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేటర్లో కంటే ఓటీటీలో బాగా ఆడింది. వేణు ఊడుగుల ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. 

ప్రస్తుతం రానా 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఈ సిరీస్ లో నటిస్తున్నారు. దాదాపు దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లే. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.  

'మానాడు' రీమేక్ లో రానా:

తమిళంలో శింబు, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మానాడు'ను తెలుగులో రానా దగ్గుబాటి రీమేక్ చేస్తున్నారు. తమిళ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. మరి, తెలుగు రీమేక్ కూడా ఆయనే తీస్తారా? లేదంటే మరొకరి చేతిలో దర్శకత్వ బాధ్యతలు పెడతారా? అనేది చూడాలి. రానా దగ్గుబాటి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు 'మానాడు' రీమేక్ రూట్స్ సొంతం చేసుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా ప్రొడ్యూస్ చేయనున్నారు.

Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!

Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే

Published at : 08 Aug 2022 05:46 PM (IST) Tags: Rana Daggubati Maanadu remake Miheeka Rana married life

సంబంధిత కథనాలు

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Bigg Boss 6 Telugu: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్

Bigg Boss 6 Telugu: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్

Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

Asha Parekh: వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Asha Parekh: వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam