అన్వేషించండి

Game On Movie: ట్రైలర్‌లో చూసింది 10 శాతమే, రా అండ్ రస్టిక్ కమర్షియల్ చిత్రమిది - హీరో గీతానంద్

Game On Telugu movie cast and crew: ఫిబ్రవరి 2న విడుదల అవుతున్న సినిమాల్లో 'గేమ్ ఆన్' ఒకటి. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.

''మీరు ట్రైలర్ (Game On Movie Trailer Review)లో చూసింది కేవలం 10 శాతం మాత్రమే. మేం ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. మంచి కాన్సెప్ట్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ఇది'' అని హీరో గీతానంద్ చెప్పారు. తన సొంత తమ్ముడు దయానంద్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా 'గేమ్ ఆన్'. నేహా సోలంకి హీరోయిన్. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ పతాకాలపై రవి కస్తూరి చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. 

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో గీతానంద్ మాట్లాడుతూ ''గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగికి జీవితంపై విరక్తి చెంది ఒక ఆటలో పడితే ఎలా ఉంటుంది? అనేది మా సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. మధుబాల, ఆదిత్య మీనన్ గారు నటించడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. మా ఆటను మన తెలుగు ప్రేక్షకులే గెలిపించాలి. ఈ సినిమాతో మా తమ్ముడు దయానంద్ యాక్షన్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడు. నేనూ నటుడుగా పేరు తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డా" అని చెప్పారు.

Also Readటు మినిట్స్ కూడా లేవుగా - వైరల్ అవుతున్న ప్రభాస్ 'సలార్' డైలాగ్స్

నిర్మాత ర‌వి క‌స్తూరి  మాట్లాడుతూ..."నిర్మాతగా నా తొలి చిత్రమిది. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. గీతానంద్ నా క్లాస్మేట్. మేమిద్దరం ఏదో ఒక రోజు సినిమా తీద్దామని అనుకున్నాం. మంచి కథతో 'గేమ్ ఆన్' తీశాం. రాజీ పడకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా తెరకెక్కించాం. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇటువంటి కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదు" అని చెప్పారు.

Also Readహృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఫేక్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?

దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ''నేను పూరి జగన్నాథ్ గారికి వీరాభిమానిని. ఆయన ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా తీశా. కమర్షియల్ స్క్రిప్ట్ రాసి, రా అండ్ రస్టిక్ ఫిల్మ్ తీశా. సినిమాలో క్యారెక్టర్లు అన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. చావాలని అనుకునే ఓ వ్యక్తి రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? ఆ తర్వాత ఏమైంది? ఆట ఆడించేది ఎవరు? అనేది సినిమా. యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్ ప్రేక్షకుల్ని అట్ట్రాక్ట్ చేస్తాయి. గీతానంద్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోయినా ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి" అని చెప్పారు.

Also Read: రవితేజ సినిమాలో కన్నడ హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?

ఈ కార్యక్రమంలో ఆదిత్య మీనన్, హీరోయిన్ నేహా సోలంకి, నటుడు కిరిటీ, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్, మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, 'బిగ్ బాస్' వాసంతి కృష్ణన్, కిరిటీ, 'శుభ‌లేక' సుధాక‌ర్‌ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్‌, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎడిట‌ర్: వంశీ అట్లూరి, స్టంట్స్‌:  రామ‌కృష్ణ‌న్‌, న‌భా స్టంట్స్‌, సంగీతం: న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌, నేపథ్య సంగీతం: అభిషేక్ ఎ.ఆర్‌, మాటలు:  విజ‌య్ కుమార్ సిహెచ్‌, ఛాయాగ్రహణం:  అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌, నిర్మాత‌: ర‌వి క‌స్తూరి, ద‌ర్శ‌క‌త్వం: ద‌యానంద్‌.

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Preethi Srinivaas : జగదాత్రి సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్.. సైకాలజీలో మాస్టర్స్.. సినిమాల్లో ఛాన్స్ వచ్చినా, ఇప్పటికీ ఆ వెలితి!
జగదాత్రి సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్.. సైకాలజీలో మాస్టర్స్.. సినిమాల్లో ఛాన్స్ వచ్చినా, ఇప్పటికీ ఆ వెలితి!
Jagadhatri Serial Today JULY 24th: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Embed widget