అన్వేషించండి

Faria Abdhullah: ‘జాతిరత్నాలు’ మూవీలో ఆఫర్ వచ్చినా ఫస్ట్ నో చెప్పిన ఫరియా అబ్దుల్లా, కారణం ఏంటో తెలుసా?

‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టిగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అయితే, తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చినా నో చెప్పినట్లు వెల్లడించింది.

Faria Abdhullah About ‘Jatiratnalu’ Movie: కర్లీ హెయిర్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. తొలి సినిమాతోనే ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. ‘జాతిరత్నాలు’ మూవీలో చిట్టి పాత్రలో ఒదిగిపోయి నటించింది. అందం, అభినయం, చలాకీతనంతో కూడా ఈ క్యారెక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకే ఒక్క సినిమాలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లరి నరేష్ తో కలిసి ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘జాతిరత్నాలు’ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో వివరించింది.

‘జాతిరత్నాలు’ సినిమాకు మొదట్లో నో చెప్పా- ఫరియా   

నిజానికి ‘జాతి రత్నాలు’ సినిమాలో తొలుత అవకాశం వచ్చినా నో చెప్పినట్లు ఫరియా అబ్దుల్లా వెల్లడించింది. “నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. మా కాలేజీలో జరిగి ఓ వేడుకకు నాగ్ అశ్విన్ చీఫ్ గెస్టుగా వచ్చారు. ఆయనకు హలో చెప్పడానికి వెళ్లాను. అతడు నన్ను చూసి యాక్టర్ కావొచ్చు కదా అన్నారు. సరే సర్ అన్నాను. అప్పుడు తనతో అంతే మాట్లాడాను. ఈవెంట్ తర్వాత అతడిని ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యాను. అలా ఆయనకు నాకు కాంటాక్ట్ ఏర్పడింది. అతడు నన్ను ‘జాతి రత్నాలు’ సినిమా హీరోయిన్ కోసం ఆడిషన్ కు రమ్మన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ నేను ‘జాతిరత్నాలు’ సినిమాకు నో చెప్పాను. ఎందుకంటే, నేను FTIIకి అప్లై చేశాను. నేను తప్పకుండా FTIIకి సెలెక్ట్ అవుతాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది. అనుకున్నట్లుగానే సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత మళ్లీ నేను నాగ్ అశ్విన్ కు కాల్ చేసి ఆడిషన్ కు వస్తాను అని చెప్పాను. సెలెక్ట్ అయ్యాను” అని చెప్పుకొచ్చింది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ  

అటు ‘జాతిరత్నాలు 2’తో పాటు ‘మత్తు వదలరా 2’ సినిమాలపైనా ఫరియా అబ్దుల్లా కీలక అప్ డేట్ ఇచ్చింది. “ప్రస్తుతం 'మత్తువదలరా 2' సినిమాలో చేస్తున్నాను. ‘జాతిరత్నాలు 2’ పైనా వర్క్ నడుస్తోంది. గోపి దర్శకత్వంలో ‘భగవంతుడు’ అనే సినిమా కూడా చేస్తున్నాను. నేను నటించన ఓ తమిళ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. కొన్ని తమిళ్, మలయాళీ సినిమా కథలు కూడా వింటున్నాను” అని వెల్లడించింది.

2021లో బ్లాక్ బస్టర్ సాధించిన ‘జాతిరత్నాలు’

2021లో వచ్చిన ‘జాతి రత్నాలు’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. అనుదీప్ కేవీ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అదిరిపోయే కామెడీతో ఆహా అనిపించారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చిట్టి పాత్రలో కడుపుబ్బా నవ్వించింది. స్వప్నా సినిమా బ్యానర్‌లో నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు.  

Read Also: నాగ్ అశ్విన్ To ప్రశాంత్ నీల్ - క్రేజీ డైరెక్టర్లతో ప్రభాస్ వరుస సినిమాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget