RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమా థియేటర్ లో ట్రాజెడీ, అభిమాని మృతి
ఎస్ వీ మ్యాక్స్ థియేటర్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా బెనిఫిట్ షోలు వేయడంతో ఓబులేసు(30) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్రీమియర్ షోకి వెళ్లాడు.

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. మెగా నందమూరి అభిమానులు థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అనంతపురం ప్రాంతంలో విషాదం నెలకొంది. థియేటర్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందారు.
ఎస్ వీ మ్యాక్స్ థియేటర్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా బెనిఫిట్ షోలు వేయడంతో ఓబులేసు(30) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్రీమియర్ షోకి వెళ్లాడు. సినిమా చూస్తున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు. కానీ మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు నిర్ధారించారు.
ఓబులేసు గుండెపోటుతో మరణించినట్లు కిమ్స్ డాక్టర్ సందీప్ ధ్రువీకరించారు. తన అభిమాన హీరో సినిమా దృశ్యాలను చిత్రీకరిస్తూ.. అతడు కుప్పకూలిపోయినట్లు స్నేహితులు తెలిపారు. మృతిని కుటుంబసభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయంపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ స్పందిస్తుందేమో చూడాలి!
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















