అన్వేషించండి

ప్రముఖ హాస్య నటుడు జయ సారథి కన్నుమూత

ప్రముఖ హాస్య నటుడు కడలి జయ సారథి(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయ సారథి(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుది శ్వాస విడిచారు. జయసారధి మరణానికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

సారథి దాదాపు 372 చిత్రాల్లో నటించి మెప్పించారు. 1961లో వచ్చిన 'సీతారామ కళ్యాణం' సినిమాతో సారథి కెరీర్‌ని ప్రారంభించారు. నందమూరి తారక రామారావు ఈ సినిమాలో హీరో. ఆ సినిమా హిట్ అవ్వడంతో తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1976లో వచ్చిన 'భక్త కన్నప్ప', 1978 లో వచ్చిన 'జగన్మోహిని' చిత్రాలు ఆయనకి విశేషమైన కీర్తిని ఇచ్చాయి. జగన్మోహిని సినిమాలో దెయ్యంతో కలిసి ఆయన చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రి మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేశారు. సారథి ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరించారు. 1942 జూన్ 26 న ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండలో జన్మించారు. అల్లు రామలింగయ్య, రేలంగి, రాజబాబు వంటి హాస్య నటులతో పాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'భలే రంగడు', 'అగ్గి వీరుడు', 'మంచి మనసులు', 'భక్త కన్నప్ప', 'ఎదురీత', 'అమర దీపం', 'ఆలుమగలు', 'జగన్మోహిని', 'మనవూరి పాండవులు', 'డ్రైవర్ రాముడు' వంటి హిట్ సినిమాల్లో ఆయన నటించారు. 90వ దశకంలో ఆయన నటనకి స్వస్తి పలికి కృష్ణం రాజుతో కలిసి ఇంటింటి రామాయణం, జమిందారిగారి అమ్మాయి వంటి సినిమాలకు సాంకేతిక సహకారాలు అందించారు. రెబల్ స్టార్ కృష్ణం రాజుతో ఆయనకి ప్రత్యేక అనుబంధం ఉంది. ధర్మాత్ముడు, అగ్గిరాజు, విధాత వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. చివరిగా సుమన్ హీరోగా నటించిన 'హలో అల్లుడు' సినిమాలో డాక్టర్ పాత్ర పోషించారు. జయ సారథి అంత్యక్రియలు మధ్యాహ్నం 2 గంటలకి మహాప్రస్థానంలో జరగనున్నాయి. 

Also Read: బుల్లితెర హీరోను కొట్టిన సిబ్బంది, సీరియల్ షూటింగ్‌లో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

Also Read: సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్- భద్రత పెంచిన ముంబయి పోలీసులు

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Balakrishna: బాలకృష్ణ డిశ్చార్జ్... ఆదివారమే - ప్రజెంట్ ఎలా ఉందంటే?
బాలకృష్ణ డిశ్చార్జ్... ఆదివారమే - ప్రజెంట్ ఎలా ఉందంటే?
The Maze First Poster : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో హీరో శ్రీరామ్ - థ్రిల్లింగ్‌గా ది మేజ్ ఫస్ట్ పోస్టర్
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో హీరో శ్రీరామ్ - థ్రిల్లింగ్‌గా ది మేజ్ ఫస్ట్ పోస్టర్
Uyir OTT : ఊరిలోని బావిలో మహిళ డెడ్ బాడీ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఊరిలోని బావిలో మహిళ డెడ్ బాడీ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Embed widget