News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ennenno Janmalabandham June 30th: యష్, వేద రొమాంటిక్ డేట్- మాళవికని వాయించేసిన సులోచన

మాళవికని తీసుకొచ్చి వేదని ఇంట్లో పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

యష్ ఆఫీసు పని మీద సింగపూర్ వెళ్తున్నానని చెప్తుంటే మాలిని వాళ్ళు వేదని కూడ వెంట తీసుకుని వెళ్ళమని చెప్తారు. మూడు రోజులు ఆఫీసు పని మీద బిజీగా ఉన్నా, మరో మూడు రోజులు సెలవు పెట్టి సరదాగా గడిపి రమ్మని చెప్తుంది. యష్ సంతోషంగా తల ఊపుతాడు. ఇల్లు, పిల్లల గురించి ఆలోచించాల్సిన పని లేదని తాము చూసుకుంటామని హామీ ఇచ్చేసరికి సరే అంటుంది. హోమంలో నన్ను కూర్చోబెట్టకుండా ఇప్పుడు మీరు సింగపూర్ అని ట్రిప్స్ వేస్తారా ఎలా వెళ్తారో నేను చూస్తానని మాళవిక మనసులో అనుకుంటుంది. చిత్ర ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఎవరో వ్యక్తి వచ్చినట్టు నీడ కనిపించేసరికి కంగారు పడుతుంది. అభిమన్యు ఇచ్చిన్ వార్నింగ్ గుర్తు చేసుకుని వణికిపోతుంది. వెంటనే వసంత్ వచ్చి భయపెడతాడు. అభిమన్యు మాటలు చెప్తే వసంత్ కూడా టెన్షన్ పడతాడని అనుకుని చెప్పకుండా ఉండిపోతుంది.

Also Read: తులసికి ఝలక్, రాజ్యలక్ష్మి ఇంట్లో పాగా వేసిన లాస్య- దివ్య జీవితం నాశనం!

యష్ ఆఫీసుకి ఫోన్ చేసి వారం రోజుల పాటు ఉండనని ఎటువంటి మీటింగ్స్ పెట్టొద్దని మాట్లాడుతుంటే వేద వస్తుంది. అదేంటి మూడు రోజులని చెప్పి ఇప్పుడు వారం  అంటారు ఏంటి ఇదేమైనా హనీ మూనా అని అడుగుతుంది. అవునని తెగ సిగ్గుపడిపోతాడు. ఇక్కడ హోటల్ లో ప్లాన్ చేస్తే మాళవిక తాగేసి రోడ్డు పక్కన పడిపోయి ప్లాన్ అంతా పాడు చేసిందని అంటాడు. ఆ మాటలన్నీ మాళవిక విని రగిలిపోతూ ఉంటుంది. పెళ్ళాంతో బాగా రొమాంటిక్ గా మాట్లాడతాడు. వీళ్ళు ఆఫీసు పేరుతో హనీ మూన్ గా తిరుగుతున్నారు, నేనేమో ఏడుస్తూ కూర్చోవాలా? హనీ మూన్ కాదు కదా అడుగు కూడా బయట పెట్టడానికి వీల్లేదని అనుకుని ఆదిత్య ముందు డ్రామా స్టార్ట్ చేస్తుంది. మనం ఇక్కడ ఉండటం ఎవరికీ ఇష్టం లేదని పాట మొదలుపెడుతుంది.

Also Read: 'నేను నా భార్యని ప్రేమిస్తున్నా ముకుంద, నీ భర్తని నువ్వు ప్రేమించు' తెగేసి చెప్పిన మురారీ

మన బాధలు ఎవరూ పట్టించుకోరు. నేను లేకుండ నువ్వు ఇక్కడ ఉండగలవా? నేను ఇక్కడ ఉండలేనని చెప్తుంది. ఈ ఇంటికి వారసుడిగా నువ్వు అందరికీ కావాలి. కానీ నేను ఎవరికీ అక్కర్లేదు. పూజలో అమ్మానాన్నని కూర్చోవాలి కానీ నన్ను కాదని వేదని కూర్చోబెట్టాడు. ఇన్ని కష్టాలు పడుతూ ఇక్కడే ఎందుకు ఉండాలి. చచ్చిపోవాలని అనిపిస్తుందని ఏడుస్తుంది. మాలిని మేడ మీద ఉంటే శర్మ వచ్చి పలకరిస్తాడు. అప్పుడే మాళవిక కూడ రావడంతో భర్తని అడ్డం పెట్టుకుని వాయించేస్తుంది. తన మాటలు తట్టుకోలేక వెళ్ళిపోతుంది. మీ తిట్లు నాకు ఆశీస్సులు పడి లేచిన కెరటంలా లేస్తాను అప్పుడు మీరెవ్వరూ తట్టుకోలేరని మాళవిక అనుకుంటుంది. వేద, యష్ ప్రయాణానికి సిద్ధమవుతారు. ఆఫీసు పని ఉండి వేదని పట్టించుకోకుండా ఉండకని మాలిని అంటుంది. అందరి ముందు తెగ ఓవర్ యాక్షన్ చేసేస్తాడు. ఆఫీసు పని మీద ఉంటాను పట్టించుకోలేదని మళ్ళీ అనుకోవద్దని బిల్డప్ కొడతాడు. సరే అయితే నేను రానులే అని వేద అనేసరికి యష్ కాళ్ళ బేరానికి వస్తాడు.

Published at : 30 Jun 2023 08:37 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial June 30th Episode

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !