Ennenno Janmalabandham February 10th: మాళవిక ముందు అడ్డంగా బుక్కైన అభిమన్యు- వేద, యష్ జీవితం ఇబ్బందుల్లో పడబోతుందా?
యష్, వేద మధ్యలోకి విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తను పనిచేసే కంపెనీకి బాస్ గా అభిమన్యు వచ్చాడని చిత్ర వేదకి చెప్తుంది. ధైర్యంగా అయితే మాట్లాడాను కానీ అతను అసలు మంచివాడు కాదని అంటుంది. అవును నేను ఇప్పుడే అతని నిజస్వరూపం చూసి వస్తున్నా, మాళవికని పెళ్లి చేసుకోకుండా మోసం చేయాలని చూస్తున్నాడు, పార్టీలో తప్పతాగి అతని దుర్బుద్ధి బయటపెట్టడాని వేద చెప్తుంది. అతను పెళ్లి చేసుకుంటాడానే ఆశతో ఆరేళ్లుగా జీవిస్తుంది. ఇప్పుడు వాడు మోసం చేస్తే ఎక్కడికి వెళ్లిపోతుందని జాలి చూపిస్తుంది. యశోధర్ మంచి భర్త తనని దూరం చేసుకుని ఆయన్ని బాధపెట్టిందని వేద అంటుంది. మాళవిక అభిమన్యు కుట్రకి బలి కావడానికి వీల్లేదని సాటి ఆడదానిగా తనని కాపాడాలని చిత్రతో చెప్తుంది. యశోధర్ తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని అంటుంది.
Also Read: 'ఏవయ్యో పెనిమిటీ' అని రిషిని పిలిచిన వసు- మిస్టర్ ఇగో మాములోడు కాదు పొగరుని ఆట ఆడించేస్తున్నాడు
వేద యష్ ఇంకా రాలేదంటా అనుకుంటూ ఉండగా వచ్చేస్తాడు. పార్టీ నుంచి ఎప్పుడో వచ్చారు కదా అని అడుగుతుంది. అంటే ఏంటి నీకోసం దోమలు కుట్టించుకుంటూ పార్కింగ్ లో వెయిట్ చేశానని అనుకుంటున్నావా, నిన్ను చూసి దాక్కున్నా అనుకుంటున్నావా అని యష్ ఆవేశంలో నిజం మొత్తం కక్కేస్తాడు. ఇప్పటి వరకు డౌట్ గా ఉంది మీరే కన్ఫామ్ చేశారని వేద అంటుంది. ఎలా తప్పించుకోవాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాడు. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. అబద్ధాలు చెప్పడం కూడా చేతకాదు మా శ్రీవారికి అని వేద నవ్వుకుంటుంది. చిత్ర ఆఫీసుకి హడావుడిగా వెళ్తుంటే వసంత్ అడ్డుపడి ఆపుతాడు. తనతో టైమ్ స్పెండ్ చేయమని అడుగుతాడు.
వేద యష్ తో అభిమన్యు గురించి మాట్లాడాలని చెప్తుంది. పార్టీలో వాడు మాళవిక గురించి వాగిన విషయం మొత్తం చెప్తుంది. మాళవిక చెడ్డదే కావచ్చు కానీ తను మన ఇద్దరి పిల్లల తల్లి మీ మాజీ భార్య ఆ అభిమన్యుని గుడ్డిగా నమ్ముతుంది. వాడి కుట్రకి మాళవికని బలి కానివ్వకూడదు. ఎందుకంటే ఆది జీవితం తనతో ముడి పడి ఉంది. ఏం చేయాలో ఎలా చేయాలో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొండని వేద చెప్తుంది. వెంటనే యష్ మాళవికకి ఫోన్ చేసి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటాడు. ఇద్దరూ ఒక రెస్టారెంట్ లో కలుసుకుంటారు. పార్టీలో అభిమన్యు వాగిన విషయం మొత్తం చెప్తాడు. అదే రెస్టారెంట్ లో మరొక వైపు వేద, విన్నీ కూడా ఉంటారు.
విన్నీ: పార్టీలో నువ్వు డిస్ట్రబ్ గా కనిపించావ్ ఏమైంది
వేద: ఏం లేదు అంతా బాగానే ఉంది. ఖుషిని తీసుకురావాలి వెళ్తాను
విన్నీ: తను యష్ కూతురు కదా
Also Read: తులసిని ఆకాశానికెత్తేసిన మాజీ మొగుడు- కుటుంబం ప్రేమ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న నందు
వేద: ఖుషి నా కూతురు తన కోసం నేను పుట్టానని అనిపిస్తుంది. యశోధర్ తో కంటే ఖుషికి నాతోనే ఎటాచ్ మెంట్ ఎక్కువ
విన్నీ: ఆర్ యు లవ్ విత్ యువర్ హజ్బెండ్ . నీ భర్తని మనస్పూర్తిగానే ప్రేమిస్తున్నావా
మరొకవైపు యశోధర్ అభిమన్యు గురించి మాళవికకి చెప్తాడు. కానీ తను మాత్రం నమ్మదు. వేద స్వయంగా వాడు అన్న మాటలు విని తనకి చెప్పిందని అంటాడు. నువ్వు రోడ్డున పడితే నా కొడుకు ఇబ్బంది పడతాడు. వాడు బాధపడితే నేను తట్టుకోలేను వాడంటే నాకు ప్రాణం అని యష్ చెప్తాడు.
వేద: ఆయన చాలా మంచివాడు. తన ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోరు. పెళ్లికి ప్రేమ మాత్రమే ముఖ్యం కాదు, చిన్న సంతృప్తి చిన్న సంతోషం కూడా పెళ్లి మీద నమ్మకం కలిగిస్తాయి