అన్వేషించండి

Ennenno Janmalabandham September 22nd: యష్ మాళవికని ఇంకా ప్రేమిస్తున్నాడా? రత్నం, మాలిని మధ్య చిచ్చుపెట్టిన సులోచన

యష్ నిధి, వసంత్ కి ఎంగేజ్మెంట్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

మాళవిక వెళ్లిపోగానే వేద వసంత్ దగ్గరకి వస్తుంది. తన చేతికి అయిన గాయానికి ఫస్ట్ అయిడ్ చేస్తుంది. మాళవిక నీకు ముందే తెలుసా అని వేద అడుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మాళవిక అభి గర్ల్ ఫ్రెండ్.. ఇంతమ ముందు మాళవిక అంటే యష్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేది. కాలంతో పాటు మనషులు మారిపోయారని చెప్తాడు. యష్ మీద ఉన్న నీకున్న ప్రేమ మంచిదే కానీ అది నీ జీవితాన్ని కూడా చూసుకో. యష్ మీద నమ్మకాన్ని పెంచుకున్నావ్ మరి నీ ప్రేమ గురించి ఆలోచించవా అతని భార్యగా చెప్తున్నా.. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పది సార్లు ఆలోచించు, ఒక్కసారి కోల్పోతే మళ్ళీ తిరిగి రాదని వేద చెప్పి వెళ్లిపోతుంది.

యష్, మాళవిక ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. క్షణం కనిపించకపోతేనే వెతుక్కుంటున్నావ్ అందుకే నీ దగ్గరకే వచ్చాను చూడు యష్ ఎందుకు చూపు తిప్పుకుంటున్నావ్ నేనేమీ అనుకొనులే అని మాళవిక అంటుంది. నేను వెతకడం కాదు నా చూపు వెళ్తున్న ప్రతిచోటుకి నువ్వు వెళ్తున్నావ్ అడ్డు వస్తున్నావ్ అని యష్ చిరాకుగా అంటాడు. అబద్ధం చెప్పకు యష్ నీకు ఎంత ఇగో ఉంటే మాత్రం ఇప్పుడు కూడా అలా మాట్లాడలా అని అంటుంది. నేను పార్టీ మూడ్ లో హ్యాపీగా ఉన్నాను నాకు చిరాకు తెప్పించకు నాతో తిట్లు తిని నువ్వు వెళ్ళడం కంటే ఇప్పుడే వెళ్లిపో నీకే మంచిది అని యష్ చెప్తాడు.

Also Read: యష్ ని తన వెంట తిప్పుకుంటా అని వేదతో ఛాలెంజ్ చేసిన మాళవిక- చిత్ర, వైభవ్ ని చూసి బాధపడుతున్న వసంత్

మంచిది అనిపించింది కాబట్టే అప్పుడే వెళ్లిపోయాను కానీ నువ్వే ఇప్పటికీ వదల్లేకపోతున్నావ్ అని మాళవిక అంటుంది. నేను నీకు చెప్పానా అని యష్ అడుగుతాడు. చెప్పక్కర్లేదు నేను నీ దగ్గరకి రాగానే తడబడుతున్న నీ గుండె ఇదే విషయం చెప్తుంది, నాకోసం ఆరాటపడే నీ కళ్ళు కూడా అవే చెప్తున్నాయ్. ఖుషి కోసం వేదని పెళ్లి చేసుకున్నావ్ కానీ ఈరోజుకి నేనే నీ మనసులో ఉన్నాను. ఎందుకో తెలుసా నేను నీ ఫస్ట్ లవ్. మధ్యలో వచ్చేవి పాసింగ్ కలఉదశ అవుతాయి కానీ ప్రేమ పొందలేవు. అందుకే వేదని పెళ్లి చేసుకున్నావ్ కానీ ఇప్పటి వరకి తనని టచ్ చెయ్యలేదు. ఆదిత్య కోసం నువ్వు మా ఇంటికి వస్తున్నావ్ నన్ను చూస్తున్నావ్ అన్నింటికీ కారణం ఎవరు నీకు ప్రేమని పరిచయం చేసింది నేను. నీ ప్రేమకి ప్రతిరూపం రెండు సార్లు కన్నది నేను. అలాంటి నా స్థానంలోకి నువ్వు వేరే వాళ్ళని తీసుకొచ్చినా నేనే గుర్తుకు వస్తాను కానీ నన్ను రీప్లేస్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇంక నా మీద కోపం, ద్వేషం అంటావా అది నా మీద కాదు నీ మీద నీకు అని మాళవిక అంటుంది.

చాలా ఊహించుకుంటున్నావ్ అని యష్ అంటే అయితే నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు నేనంటే నీకు ప్రేమ లేదని అని మాళవిక ఎదురుగా నిలబడుతుంది. యష్ మాళవికతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తు చేసుకుంటూ తనని చూడలేక పక్కకి తిరుగుతాడు. నాకు తెలుసు యష్ నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదు నీ మనసులో నాకు తప్ప ఇంకొకరికి చోటు లేదని మాళవిక అనేసి వెళ్ళిపోతుంది. యష్ తర్వాత మాళవిక మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. యష్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం అంతా తలుచుకుంటాడు.

Also Read: రాధతో ఏడడుగులు వేసిన మాధవ్ - ఆదిత్యే రాధ భర్త అని తెలుసుకున్న జానకి

ప్రేమ అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నా జీవితంలో కూడా ఒకరు ఉన్నారు. తన వల్ల ప్రేమ విలువ తెలిసింది. ఆ ప్రేమ గురించి మీ అందరికీ తెలిసేలా చేయడం కోసం తనతో డాన్స్ చేయబోతున్నా అని యష్ మైక్ లో చెప్తాడు. వేద తననే అనుకుని మురిసిపోతూ ఉంటే ఖుషి మమ్మీ వెళ్ళు డాన్స్ చెయ్యి అని అనడంలో వేద వెళ్లబోతుంది. అప్పుడే వేద మాళవిక పేరు చెప్తాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. మాళవిక ఎంట్రీ ఇస్తుంది. కమాన్ మాళవిక మన పాత కెమిస్ట్రీ ఏంటో చూపిద్దాం అని యష్ మాళవిక చేతిని అందుకుంటాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన మాళవిక యష్ మీద పడిపోతూ డాన్స్ చేస్తూ ఐ లవ్యూ చెప్తుంది. అది చూసి వేద గుండె ముక్కలవుతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget