అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Dooralaina Theeralaina: 'ది ఘోస్ట్' - రోల్ రైడా పాడిన ర్యాప్ సాంగ్ అదిరిందిగా!
'ది ఘోస్ట్' సినిమా నుంచి కొత్త పాటను వదిలారు.
అక్కినేని నాగార్జున(Nagarjuna) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది ఘోస్ట్'(The Ghost). సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. దీనికి ప్రవీణ్ సత్తారు(Praveen Sattharu) దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను, కొన్ని పాటలను విడుదల చేశారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ర్యాప్ సాంగ్ ను వదిలారు. 'దూరాలైనా తీరాలైనా' అంటూ సాగే ఈ ర్యాప్ సాంగ్ రోల్ రైడా, అనురాగ్ కులకర్ణి కలిసి పాడారు. మనోజ్ కుమార్ జూలూరి ఈ పాటను రాశారు. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
'ది ఘోస్ట్' కోసం నాగార్జున రిస్క్:
నాగార్జున తన ఘోస్ట్ సినిమాను హిందీలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ హిందీ శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులు అన్నీ ఎప్పుడో అమ్మేసారు. ఇప్పుడు హీందీలో థియేటర్లలో విడుదల చేయాలంటే ఆ బయ్యర్ కి మాత్రమే సాధ్యం. అయితే హిందీ బెల్ట్ లో థియేటర్లలో సినిమాను విడుదల చేయడమంటే చిన్న విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. తను అంత రిస్క్ చేయలేనని బయ్యర్ చెప్పేశారు. నిర్మాతది కూడా అదే మాట. ఈ క్రమంలో నాగార్జున గనుక ఖర్చులు భరిస్తే తాను హిందీలో సినిమా రిలీజ్ చేస్తానని.. ఒకవేళ మంచి ఆదాయం వస్తే అప్పుడు ఖర్చులు ఇవ్వాల్సిన పని లేదని బయ్యర్ కు నాగార్జునకు మధ్య డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.
ఖర్చులు రూ.4 కోట్ల వరకు అవుతాయని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆదాయం రాకపోతే ఆ రిస్క్ తను భరిస్తానని చెప్పి.. నాగార్జున సినిమాను హిందీ బెల్ట్ లో విడుదల చేయిస్తున్నారట. 'బ్రహ్మాస్త్ర' తరువాత నాగ్ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ ధీమాతోనే ఈ రిస్క్ చేస్తున్నట్లున్నారు. ఇక ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా నాగార్జున.. ఆంధ్రలోని వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ప్రాంతాల హక్కులు తీసుకున్నారు. వీటి మొత్తం బిజినెస్ చూసుకుంటే రూ.6 కోట్ల వరకు ఉంటుంది. సినిమా హిట్ అయితే నాగార్జునకు ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ కలెక్షన్స్ రూపంలో దక్కుతుంది.

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement